పుష్కరాలంటే ఏమిటి ?? పుష్కరాలపుడు ఏరోజు ఏమి చేయాలి??పుష్కరాలలో ఏ సమయంలో స్నానం చేయడం మంచిది??గోదావరి పుష్కరాలు ఎపుడు??

1ad

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలోఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. (పంచభూతాలు+ మనస్సు,బుద్ధి,అహంకారం=8)(అష్టమూర్తులలో జలం ఒకటి). తుందిలుడు భగవంతుని యొక్క జలరూపాన్ని పొందడం వలన అతనికి పుష్కరుడు అనే పేరు వచ్చింది.) అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. కానీ పుష్కరుడికి బ్రహ్మను వదిలి వెళ్లడం ఇష్టం లేదు అందుకే తాను అలా బ్రహ్మను వీడనన్నాడు… అప్పుడు అందరూ ఆలోచించిబృహస్పతి ఎప్పుడు కొత్తరాశిలో ప్రవేశించినా మొదటి పన్నెండురోజు, చివరి పన్నెండు రోజులు– ఆసంవత్సరంలోని మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నాలుగు ఘడియలు(తొంభైఆరునిమిషాలు) మాత్రం పుష్కరుడు బృహస్పతి ఆధీనంలో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సకలదేవతలతో బ్రహ్మ పుష్కరునితో ఉండాలి. మూడున్నర కోట్ల తీర్థాలకు అధిపతి అయిన పుష్కరుడు ఈ నియమాన్ని అనుసరించి బ్రహ్మాది దేవతలతో, బృహస్పతితో కలిసి, ఏ నదికి పుష్కరం వస్తుందోఆ అనదిలో నివసిస్తాడుఇ. ఆ కాలం ఆ అన్దికి మహా పుణ్యకాలం!! దేవతలందరూ ఆ సమయంలో ఆ నదిలో ఉండడం వలన దాని ప్రభావం ఎన్నోరెట్లు పెరుగుతుంది పుష్కరకాలంలొ ఆ నదిలో స్నానం చేసి, తీరంలో తర్పణం శ్రాద్ధం మొదలైన కర్మలు ఆచరించడం వలన గొప్ప ఫలితం లభిస్తుంది. పుష్కర కాలంలో ఆ నదీ తీరంలో చేసే తర్పణ శ్రాద్ధాదుల వలన పితృ దేవతలకు ఉత్తమలోకాలు ప్రాప్తిస్థాయి. వంశాభివృద్ధి కలుగుతుంది. దేశం సస్యశ్యామలమై సుభిక్షంగా ఉంటుంది. సమాజం శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా ఉంటుంది.

ఆయా నదీతీరాల్లో విలసిల్లే క్షేత్రాలనూ, అక్కడ నెలకొన్న దేవతామూర్తులను ఈ పుష్కరకాలంలొ ఆరాధించడం, దేశ శాంతి సౌభాగ్యాలకై ప్రార్థించదం మన కర్తవ్యం.
పుష్కరనదులలలో చేసే ఏ పవిత్రకార్యమైనా త త్ క్షణమే సత్ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. పుష్కరస్నానం తాపాలనూ, పాపాలనూ పోగొడుతుంది. సమస్థ శుభాలు ప్రసాదిస్తుంది. వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.

పుష్కరాలలో ఏ సమయంలో స్నానం చేయడం మంచిది??
పుష్కరకాలంలో ప్రాతః కాల స్నానం ఉత్తమం. మధ్యాహ్న స్నానం మధ్యమం. సాయంకాల స్నానం సామాన్యం.

పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు:
మొదటి రోజు;- సువర్ణ దానం,రజితము దానం,ధాన్య దానం ,భూదానం చేయాలి.
రెండవరోజు;-వస్త్ర దానం,లవణ దానం,రత్న దానం చేయాలి.
మూడవ రోజు;- గుడ(బెల్లం),అశ్వశాఖ,ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు;-ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.
ఐదవ రోజు;-ధాన్యదానం ,శకట దానం,వృషభదానం,హలం దానం చేయాలి.
ఆరవవ రోజు;-ఔషధదానం,కర్పూరదానం,చందనదానం,కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు;-గృహదానం,పీట దానం,శయ్య దానం చేయాలి.
ఎనిమిద రోజు;-చందనం,కందమూలాల దానం,పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు;-పిండ దానం,దాసి దానం,కన్యాదానం,కంబళి దానం చేయాలి.
పదవ రోజు;-శాకం(కూరగాయలు)దానం,సాలగ్రామ దానం,పుస్తక దానం చేయాలి.
పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు;-తిల(నువ్వులు)దానం చేయాలి.

ఈ సంవత్సరం బృహస్పతి సింహ రాశిలో జులై14 – 25 ప్రవేశిస్తున్నాడు కాబట్టి గోదావరి నదికి పుష్కరాలు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 81 = 91