స్వైన్ ప్లూ పై ముందస్తు జాగ్రత్తలు పాటించాలి…

swine-flu-virus

స్వైన్‌ ప్లూ రాకముందు తగు సూచనలు, సలహాలు పాటిస్తే మంచిది. …. అందుబాటులో ఉన్న మరింత సమాచారాన్ని మిత్రులు తెలియజేసి ముందస్తు జాగ్రత్తలు పాటించేలా ప్రజలను చైతన్యవంతులు చేయాలి..

లక్షణాలివి :

జలుబు, గొంతు, ముక్కు నుంచి నీరు రావడం, గొంతు, తలనొప్పి, ఒళ్ళంతా నొప్పులు, కొంతమందికి వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు చిన్న పిల్లల్లో చర్మం నీలంగా , బూడిద రంగులో మారడం.

వ్యాప్తి చెందే విధానం :

స్వైన్‌ ప్లూ కి మూలం హెచ్‌ ఐఎన్‌ఐ వైరస్‌. ఇది నాలుగు వైరస్‌లు మిశ్రమం. సీమ పంది, పక్షులకు చెందిన ఒక్కొక్క వైరస్‌ మనిషి లో ఉన్న రెండు వైరస్‌ల మిశ్రమంతో ఈ వైరస్‌ ఉపిరి పీల్చు కుంటుంది.

ఇది చల్లటి వాతావరణంలో ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంటుంది. 40 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో గరిష్టంగా రెండు గంటల తట్టుకొని ఉండగలదు.

ఇప్పటికీ ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు గాలి ద్వారా లేదా ఉమ్మినపుడు తెమడ ద్వారా వ్యాపిస్తుంది.

నివారణ చర్యలు : స్వైన్‌ ప్లూ లక్షణాలు కనిపిస్తే 24 గంటల పాటు బయటకు రాకూడదు. దీ ర్ఘకాళిక వ్యాధులతో ( ఆస్మా, బ్రాంకౖౖెటిస్‌, గుండెజబ్బు, మూత్రపిండ సమస్యలు, మధుమేహం, క్యాన్సర్‌, హెచ్‌ఐవితో బాధపడే వారికి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులు సంప్రదించాలి. స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కనిపించిన రెండు రోజుల్లో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి.

ఇది చికిత్స :

స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగులు కాస్త వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి.

ఉదయం, సాయంత్రం రోగులను వైద్యులు పరీక్షిస్తారు.

గొంతు నొప్పి ఉంటే జిత్రో మైసిన్‌, అపిసిలిన్‌ తదితర మందులతో పాటు జ్వరం ఉండి విపరీతంగా చెమట పడుతుంటే సెలైన్‌, లింగల్‌, లాక్టోజ్‌ వంటివి ఎక్కిస్తారు.

ఆహారం తీసుకునేటప్పుడు తప్పించి మిగతా సమయంలో రోగి తప్పనిసరిగా ఎన్‌ – 95 మాస్క్‌ ధరించాలి.

వేళ్లకు మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడితే పది రోజుల్లో తగ్గిపోతుంది.

పదిరోజులు తరువాత రోగి నుంచి మరోసారి నమూనాలను సేకరించి పరీక్ష చేస్తారు. వైరస్‌ తీవ్రత తగ్గినట్లు తేలితే ఇంటికి పంపిస్తారు. ఇక వాళ్లు యధావిధిగా విధులకు హాజరుకావచ్చు.

వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే ఉపిరితిత్తుల్లో నీరు చేరి నిమోనియా తదితర సమస్యలతో పరిస్థిితి తీవ్ర మవుతుంది. అందుకే స్వైన్‌ ప్లూ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఏది ఏమైనా వ్యాధి రాకుండా అందరూ ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

30 + = 34