దీపావళి వెలుగులకు చీకటి రోజులు..

happy-diwali-deepak-hd-walls

దీపావళి కళ తప్పింది.. హుదూద్ తుఫాన్ ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా పడింది.. మార్కెట్ లో బాణసంచా వ్యాపారులకు అయితే నిజంగా కష్టకాలమే… నష్ట….కాలమే… ఒకప్పుడు మూడు దశాబ్దాల కిందట…దీపావళి వస్తుందంటే రెండు మూడు నెలల నుంచి సందడి విపరీతంగా ఉండేది.. నెల రోజులు ముందుగానే తెలుగువారి లోగిళ్ళలో ఆబాల గోపాలం తుపాకీలు చేతబట్టి ఉరుకులు .. పరుగులు …. సీమటపాయకాయలు మాదిరిగా మోత మోగించే వారు.. నిద్రలేచింది మొదలు… తిరిగి నిద్రపోయే వరకూ చేతిలో ఆయుధం తుపాకీ ఉండాల్సిందే.. జేబులో తుపాకీ మందు బిళ్ళల రీళ్ళు చేతికి అందేలా దండిగా ఉండాల్సిందే.. వీధి…. వారం రోజులు ముందుగానే తల్లి దండ్రులు, బంధువులు..కుటుంబ పెద్దలతో మార్కెట్ కు వెళ్ళి బాణసంచా దుకాణాలు అన్నీ తిరిగి.. ఇష్టమైన బాణసంచా వెతుక్కుని.. ఎంపిక.. చేసుకుని… కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి వారం రోజులు కూడా ప్రతి రోజు ఉదయం..ఎండలో ఆరబెట్టి సాయంత్రం అయ్యే సరికి తిరిగి ఇంట్లో భద్రపరుచుకోవడం… కళ్ళారా… బాణసంచా చూకుకుని మురిసి పోతూ ఉండటం దినచర్య లో ఒక భాగం …. ఇదంతా కూడా దీపావళి పండుగకు ముందు రోజులు… పండుగ రోజున దీపావళి బాణసంచా కాల్చేసిన తరువాత మరుసటి రోజు నుంచి నేను అన్ని వందల రూపాయలు బాణా సంచా కాల్చాను అని ఒకరు.. ఒరేయి నేను అయితే పెద్ద పెద్ద లక్ష్మీ బాంబులు కాల్చాను అని మరొకరు.. ఓస్ అంతేనే నేను అయితే పెద్ద…పెద్ద.. తాడు బాంబులు చేత్తో పట్టుకుని కాల్చాను తెలుసా అని ఒకరిని మించి ఒకరు కధలు.. కధలుగా…గొప్పలు చెప్పుకుంటూ వారం పది రోజులు కాలక్షేపం చేసేవారు… దీపావళి పండుగకు ముందు… ప్రతి వీధిలో నూ తారా జూవ్వలు.. చిచ్చుబుడ్డులు…మతాబాలు…. తయారు చేసే పనిలో యువత నిమగ్నమయి ఉండేది.. కొందరు యువకులు కొన్ని నెలలు ముందుగానే జువ్వల తయారీకి ఎంతో ప్రణాళికాబద్దంగా వ్యవహరించే వారు.. పనికి రాని పేకముక్కలు సేకరించడం… వాటికి మైదా పిండిలో ఉడకబెట్టిన నార చుట్టి … తారాజువ్వల కోసం ముందుగానే డొప్పలు తయారు చేసి ఎండలో ఆరబెట్టి ఉంచేవారు.. సూరేకారం, బొగ్గు, గంధకం.. తదితర రసాయన పదార్ధాలను తగిన పాళ్ళలో కలిపి దీపావళి జువ్వలు తయారు చేసే పనిలో రాత్రి పగలు ఉండే వారు.. కొబ్బరి చీపురు పుల్లలు కట్టి జువ్వలు సిద్దం చేసేవారు…చీకటి జువ్వలు.. వెలుగు… జువ్వలు.. పోటీ జువ్వలు అబ్బో రకరకాలుగా జువ్వలు అన్నీ కూడా స్వయంగానే యువత తయారు చేసుకుని దీపావళి వేడుకలకు సిద్దమయ్యేది.. అంతే కాదు… మరి కొందరు అయితే ఈ సారి దీపావళికి బాణసంచా పెద్ద మొత్తంలో విక్రయించి… ఎక్కువ మొత్తంలో సొమ్ములు సంపాదించి… కుంబానికి అవసరాలన్నీ తీర్చుకోవడానికి భారీ లక్ష్యాలు నిర్ణయించుకునే వారు.. గతంలో చేసిన అప్పులు.. భవిష్యత్ అవసరాలు అన్నీ గట్టెక్కేలా ఆర్ధిక పరిస్ధితి మెరగుపరుచుకోవడానికి దీపావళి పండుగ ఎంతో దోహదం చేసేది.. దీపావళి నెల రోజుల ముందు నుంచి యువకులు టపాసుల తయారీ ఉన్నారని గుర్తుగా చేతులన్నీకూడా మసి బారి కనిపించేవి… ఆ.. యువకుడి చేతులు చూసి.. ఇతను ఎక్కడో జువ్వలు తయారు చేస్తున్నాడని చెప్పేయవచ్చు.. అక్క.. చెల్లెళ్ళు.. అన్న.. దమ్ములు… చిన్నారులతో దీపావళి శోభ అంతా బంగారు వెలుగులతో ధగ ధగ ప్రజ్వరిల్లుతూ ఐశ్వర్య ల క్ష్మి నిలయాలుగా తెలుగు వారి ప్రతి గడప నేత్ర పర్వంగా ఉండేది… క్రమక్రమంగా నాగరికత అభివృద్ది చెందుతూ కాలం మారుతోంది.. ప్రభుత్వ విద్య ప్రైవేటు పరం అయింది.. కార్పోరేట్ విద్యావిధానం అమలులోకి వచ్చింది.. మెట్రోపాలిటీ కల్చర్ వచ్చేసింది.. ఫలితంగా జీవనవిధానంలో పోటీ తత్వం పెరిగింది.. యాంత్రికంగా… కాలమానం గడియారం ముల్లుతో సమానంగా జీవనం తయారు అయింది.. ఫలితంగా తీరకలేని వాతావరణం.. ఈ నేపద్యంలో నే రాజకీయ చైతన్యం పెరిగి పోయింది.. ఎన్నికల ముందు దేశ భక్తుల జయంతికి.. వర్ధంతి ఏ విధంగా కృత్రిమంగా హడావుడి చేస్తారో.. అదే విధంగా పండుగలకు హంగామా సృష్టిస్తూ.. అనుచరులకు.. పార్టీ శ్రేణులకు… బాణసంచా పంపిణీ చేయడం ప్రారంభం అయింది.. ఆశావహులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అనుచర గణానికి పెద్ద మొత్తంలో బాణసంచా అందేది..అయితే ఎన్నికల అనంతరం.. 2014 సంవత్సరంలో… వచ్చిన దీపావళికి సందడి బాగా తగ్గిపోయింది.. హుదూద్ తుపాన్ కారణంగా రాజకీయ పెద్దలు కూడా దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చవద్దని.. కేవలం దీపాలు వెలిగించి… బాదితులకు జీవితాలలో వెలుగులు పంచడానికి బాణసంచా ఖర్చును విరాళంగా అందజేయాలన్న ఆదర్శవంతమైన పిలుపు కూడా పండుగ పై పడింది.. రోజులు మరిచి పోయి… గంటల కొద్ది కంప్యూటర్ లు… సెల్ ఫోన్ లలో ఛాటింగ్… చేసుకునే కాలం ఇది… దీపావళి పండుగను కూడా కంప్యూటర్ స్ర్కీన్ పైనే చేసుకుని సంబరపడే యుగంలోకి ప్రాదమికంగా అడుగులు వేయడం ప్రారంభించిన తరువాత వస్తున్న దీపావళి అమావాస్య నాడు వెలుగు దివ్వెల సందడిని మరింత తగ్గిస్తోంది..

happy

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + = 11