దేవీ నవరాత్రులు

durganavratri

అమ్మలకే అమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ దుర్గా మాత నవ విధ అవతారాలని అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ దసరా నవరాత్రులు. దేవీ భాగవతంలో శక్తిస్వరూపిణీ మాతకు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులకన్నా అధిక ప్రాధాన్యమివ్వబడింది. విజయం ప్రాప్తించాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి.’ త్రిపురార వ్యాసం’లోని మహాత్మ్యఖంఢం శక్తి ఉపాసనా విశిష్టతను స్పష్టం గావించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం ‘సప్తశతీ, ‘లలితాత్రిశతి ‘, లలితా సహస్రనామం ఆదిగాగల గ్రంధాలలో కూడా కనపడుతుంది. ఆమెయే త్రిపురా రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అట్టి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు.

తల్లిని దేవతగా గుర్తించి పూజించడం శక్తాభావ వికాసంలోని పద్ధతి . నీవే సరస్వతివి, నీవే మహాలక్ష్మివి, నీవే శాకంభరివీ, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణాన్ని సమన్వయాన్ని సాధించే దిశలో శ్రీ శంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు.
వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తులుగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

49 − 40 =