WiFi కన్నా LiFi Speed Internet 1 Sec 23 Movies Downloads

స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని ప్రపంచం మొత్తం అరచేతిలో దర్శనమిస్తోంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏది కావాలన్నా… స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పనులు జరిగిపోతున్నాయ్. అయితే మనకు కావాల్సిన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఇవ్వాలంటే వాటికి ‘ఇంటర్నెట్’ తప్పని సరి. ప్రపంచాన్ని ఇంతలా ఉర్రూతలూగిస్తున్న ఇంటర్నెట్ ప్రస్తుతం రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఒకటి కేబుల్ వ్యవస్థ(LAN). రెండు వైర్‌లెస్ వ్యవస్థ(WAP). కేబుల్ వ్యవస్థను కంప్యూటర్లకు వాడుతుంటే.. వైర్‌లెస్ విధానాన్ని అత్యధికంగా మొబైల్ ఫోన్‌లకు వాడుతున్నారు. కేబుల్ వ్యవస్థలో ‘వైర్’ అనే నిర్ధిష్ట వాహకం ద్వారా ఇంటర్నెట్ ప్రవహిస్తే.. వైర్‌లెస్ వ్యవస్థలో రేడియోతరంగాల ద్వారా ఇంటర్నెట్ అందుతుంది. అయితే WAP పనిచేయాలంటే LAN ఉండాల్సిందే. WAP ద్వారా వచ్చే విద్యుదయస్కాంత తరంగాలను వైర్‌లెస్ అడాప్టర్స్ ద్వారా రేడియో తరంగాలతో సమ్మిళితం చేసి వాటిని రేడియో తరంగాల వేగంలో ప్రయాణించేలా చేస్తారు. ఈ ప్రక్రియలో LAN కన్నా WAP ద్వారా వచ్చే ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనం వాడుతున్న WiFi ఈ ప్రక్రియ ఆధారంగానే పనిచేస్తుంది. అయితే వైఫై కన్నా మెరుగైన విధానం అతి త్వరలోనే రాబోతోంది. అదే LiFi (లైఫై= లైట్ ఫెడిలిటీ). ఇందులో కాంతి తరంగాలు లేదా కిరణాల ఆధారంగా ఇంటర్నెట్ పనిచేస్తుంది. అంటే ఎల్ఈడీ బల్బులే ఇందులో అడాప్టర్లుగా పనిచేస్తాయి. వైఫై రౌటర్ నుంచి వచ్చే ఇంటర్నెట్ కన్నా లైఫై బల్బు నుంచి వచ్చే ఇంటర్నెట్ అత్యధిక వేగంగా ఉంటుంది. వైఫై వేగం అత్యధికంగా సెకెనుకు 1 జీబీ ఉంది. అదే లైఫ్ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం సెకెనుకు 224 జీబీ వరకు ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే LiFi ద్వారా సెకెనుకు 23 సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

lifi

Comments

comments

You may also like...