The Pic that has made fun of TDP Party

టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలిసుండదని అందరికి తెలిసిన మాటే. అందుకే టీడీపీ  ఏ కార్యక్రమం నిర్వహించినా  దాన్ని ప్రజల్లోకి  తీసుకెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు  భావిస్తుంటారు. ప్రజల్లోకి తీసుకెళ్తే అవగాహనతో పాటు పార్టీకి కూడా  పబ్లిసిటీ ఉంటుందని ఆయన భావన కావచ్చు.  పబ్లిసిటీ కోరుకోవడంలో తప్పులేదేమో గానీ.. అందులో తేడా వచ్చినప్పుడే పబ్లిసిటీ కాస్త ఇరుకన పడేసే  వ్యవహారంగా  మారిపోతుంది . తాజాగా విజయవాడలో టీడీపీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వ్యవహారంలో ఇలాంటి పొరపాటే జరిగింది. పాలనకు టెక్నాలజీని ఎలా జోడించాలనే విషయమై టెక్ విద్యార్థుల చేత టీడీపీ నేతలకు చంద్రబాబు పాఠాలు చెప్పించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి  సంబంధించిన కొన్ని ఫోటోలను టీడీపీ బయటకు విడుదల చేసింది. అయితే అసలు మానిటర్ కూడా ఆన్ చేయకుండానే.. కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు విసురుతున్నారు. మానిటర్ కూడా ఆన్ చేయకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇలా ఫోటోలకు పోజులిచ్చారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో గానీ మొత్తానికి టీడీపీ శిక్షణా తరగతుల వ్యవహారంపై నెటిజెన్లు మాత్రం మండి పడుతున్నారు. శిక్షణ ఇచ్చే విద్యార్థి మౌస్ పట్టుకుని గద్దె రామ్మోహన్‌కు టెక్ పాఠాలు చెబుతున్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. అయితే కేవలం అది ఫోటో‌కు ఫోజే గానీ మానిటర్ ఆన్ చేయకుండానే పాఠాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.

tdp

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *