Swachh Bharat Song Launched by Shri. Chandra Babu Naidu

‘రండి.. రండి.. ఆంధ్రులారా.. ఆంధ్రను హరితాంధ్రను చేద్దాం’ అంటూ గుంటూరు జిల్లాకు చెందిన రైతు నెల్లూరి మోహనరావు స్వయంగా రచించి రూపొందించిన సామాజిక చైతన్య గీతాల ఆడియో క్యాసెట్‌ను ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. స్వచ్ఛ్ భారత్, రాజధాని అమరావతి, నీరు-చెట్టు అంశాల మీద ప్రత్యేకంగా రాసిన ఈ పాటల సంకలనానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ శిష్యుడు వినోద్ సంగీతం సమకూర్చారు. ప్రముఖ సినీ గాయకుడు సింహా ఈ గీతాలన్నీ ఆలపించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై సమాజంలో అవగాహన, చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యయ ప్రయాసలు భరిస్తూ మెహనరావు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఇంకా, ఈ ఆడియో క్యాసెట్‌లో ‘ఆంధ్ర రాజధాని అమరావతికొచ్చాము.. రేపటి ప్రపంచానికి కనువిందు తెచ్చాము..’, ‘కదులుతుంది టౌను, పల్లె స్వచ్ఛ భూమికి.. భరతమాత హరిత వనం పెంచడానికి…’ తదితర పల్లవులతో కూడిన గీతాలు వున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని చూసి ముందుకొచ్చి తన వంతుగా ఇలా పాటల ద్వారా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని చెబుతున్న మోహనరావుది గుంటూరు జిల్లా నార్నెపాడు.

swachh-bharat-andhra-song

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *