SS Rajamouli alias Jakkana Comments on Sathakarni Movie

నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం టీజర్ బాలయ్య అభిమానులను సంతోష సాగరంలో ముంచింది. ముఖ్యంగా ఈ టీజర్‌లో బాలయ్య కనిపించే సీన్ అద్భుతంగా ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాక, నందమూరి హీరో చెప్పిన డైలాగులకు సంచలనం సృష్టిస్తూ రికార్డు స్థాయిలో ఈ టీజర్‌కు వ్యూవర్‌షిప్‌ను పెంచుతున్నాయి. సాధారణ అభిమానుల నుంచి స్లార్ల వరకు ఈ టీజర్ బాగుందని చెప్పుకుంటున్నారు. టీజర్ విడుదలైనప్పటి నుంచి దీనిలోని సన్నివేశాలు బాహుబలి రేంజ్‌లో ఉన్నాయని, ఔట్‌పుట్ సైతం ఆ సినిమా రేంజ్‌లో ఉందని అభిమానులు సోషల్ నెట్‌వర్క్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాపై ఆయన చేసిన కామెంట్లు ఫిలిం వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. టీజర్‌కు స్పందించిన రాజమౌళి విజువల్స్ విషయంలో ఈ చిత్రం బాహుబలికి ఏ మాత్రం పోటీ కాదని చెప్పినట్లు టాలీవుడ్‌లో ఒకటే చర్చ. ఈ రెండు చిత్రాలు వేటికవే ప్రత్యేకమైన చిత్రాలేనని రెండింటి మధ్య ఏ మాత్రం పోటీలేదని రాజమౌళి కామెంట్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

nbk-gautami-putra-satakarni-first-look-poster

ఈ కామెంట్ లో రాజమౌళి గారి కాన్ఫిడెన్సు చూడాలో లేక అత్యుత్సాహం చూడాలో తెలీడం లేదు.  బాహుబలి ఒక అద్భుత విజయం కాదని అని అనము, కాని అందులో గొప్పతనం ఏముంది? నిజాయితి గా విమర్శిస్తే ఎన్నో మేకింగ్ mistakes చూసాం, నలుగు ఇంగ్లీష్ చిత్రాలని చూసి mixi లో వేసి బయటకి తీయడానికి జక్కన్న గారు సమత్సరాలు తరబడి సాగాదిస్తున్నారన్న విమర్శలు లేక పోలేదు. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు కాదు అని కాదు ఎదుటి వారిని ప్రోత్సహించెంత పెద్ద మనసు ఉన్నా లేక పోయినా కనీసం నిరుత్సాహ పర్చడం మానుకోవడం ఉత్తమం. ఒక విధం గా చూస్తే బాహుబలి ఒక కల్పిత కధ… Gautamiputra Satakarni చారిత్రాత్మక కధ… తేడా చాలానే ఉంది…

Comments

comments

You may also like...