Sand Mafia will not be tolerated further in Andhra Pradesh

ఇసుక అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించనని హెచ్చరించారు. తెదేపా శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యేలు, నియోకవర్గ ఇన్‌ఛార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలపై ఈనాడులో ప్రచురితమైన కథనంపై చంద్రబాబు స్పందించారు. దీనిపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. ఇసుక అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించనని హెచ్చరించారు. కిందిస్థాయి నేతలు తప్పుచేస్తే.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలదే బాధ్యతని పేర్కొన్నారు. మీ స్థాయిలో తప్పులు సరిదిద్దకపోతే.. నా స్థాయిలో జోక్యం ఉంటుందిఅని చెప్పారు. ఒకరిద్దరిపై వేటువేస్తే వ్యవస్థ మొత్తం దారిలోకి వస్తుందని సీఎం అన్నారు.

For Genuine Sand Booking Visit: Builderstrolley.com

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *