Real time Governance in AP by involving students

అన్ని విభాగాలకు వేదికగా ‘ఇ-ప్రగతి’

విద్యార్ధులకు భాగస్వామ్యం

ప్రతి బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష

విజయవాడ, అక్టోబర్ 8 : సమర్ధవంతమైన పాలన అందించేందుకు త్వరలోనే రియల్‌టైమ్ గవర్నెన్స్‌(ఆర్టీజీ)ను సంపూర్ణంగా అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీ కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఐటీ సలహాదారుతో శనివారం విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి పాలనలో పూర్తిస్థాయిలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను ప్రవేశ పెట్టేందుకు ఇక ప్రతి బుధవారం సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ముందుగా ఇ-ప్రగతి కిందకు అన్ని శాఖలను, విభాగాలను తీసుకురావాల్సిందిగా స్పష్టం చేశారు. ఇ-ప్రగతి అన్ని విభాగాలను, శాఖలను కలిపే ఒక ప్లాట్‌ఫామ్‌గా వుండాలని దిశానిర్దేశం చేశారు. ఇ-ప్రగతి కింద చేపట్టిన 72 ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు సహాయకారిగా వుండేందుకు త్వరలో అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

కనీసం 80 శాతం ప్రజలు సంతృప్తి చెందడమే తన లక్ష్యమని సమావేశంలో పేర్కొన్న  ముఖ్యమంత్రి రియల్ టైమ్ గవర్నెన్స్ సంపూర్ణ అమలుతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ, నరేగా, ఉపకారవేతనాలు వంటి చోట్ల ఆర్టీజీ ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఇ-గవర్నెన్స్‌లో అగ్రస్థానంలో వున్న కెనడా, దక్షిణ కొరియా, సింగపూర్ స్థాయిని ఆంధ్రప్రదేశ్ చేరుకోవాలని, ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కు సంబంధించి వివిధ శాఖలు, విభాగాల్లో సమస్యలు తలెత్తకుండా ఆర్టీజీ కమిటీ చూడాలని సూచించారు.

సరికొత్త ఆలోచనల కోసం పోలవరం, అమరావతితో పాటు ఇ-ప్రగతిలోనూ విద్యార్ధులను భాగస్వాములను చేయాలని, ఇది విద్యార్ధులకు అనుభవంగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి అధికారులతో చెప్పారు.

సమావేశంలో డిజిపి సాంబశివరావు, ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న, ఆర్టీజీ కమిటీ సభ్యులు రాజశేఖర్ పాల్గొన్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *