తెలుగు దేశం పార్టీ బలహీనతలు మరియు బలాలు ఇవే…

chandrababu-naidu-marriageతెలుగుదేశం లో రాజకీయ వారసత్వాలు, కుటుంబ పాలన, రాజ్యాంగేతర శక్తులు  కొత్తేమి కాదు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్  ఏమి మొదటివాడూ కాదు. ఇందుకు దేశం లో వున్న ఏ ప్రాంతీయ పార్టీ కుడా మినహా యింపు కాదు. వ్యవస్థాపక ఆధ్యక్షుడు ఎన్ టి రామారావు “దశమగ్రహాలు” దగ్గుబాటి వెంకటేశ్వరావు, నారా చంద్రబాబు నాయుడుల తో మొదలైన రాజ్యాంగేతర శక్తుల ప్రాభల్యం , లక్ష్మి పార్వతి రాక తో అంతర్గత యుద్దానికి దారితీసింది. ఆల్లుళ్ళ పోరు ఓక దశ లో పార్టీ ఆభివృద్ధి కి కుడా ఉపయోగపడింది. కానీ అత్తతో అల్లుళ్ళ పోరు  ఎన్టీఅర్ ఆధిపత్యాన్ని, చివరకు ప్రాణాన్ని పరోక్షంగా  బలిగొన్నది. అయితే చంద్రబాబు నాయుడుకు ఏకైక సంతా నమైనందున  ప్రస్తుతం కుటుంబ పరమైన వారసత్వ పోరు వుండక పోవచ్చును.

chandrababu-and-ntr-photo

            కాగా  కాంగ్రెస్ పుణ్యమా అంటూ దేశంలో కుటుంబ పెత్తనం వారసత్వ రాజకీయాలకు కొదవలేకుండా పోయింది. బిజెపి వామపక్షాలు మినహా దేశం లోని అన్ని పార్టీలు వ్యవస్తాపక నేతల స్వంత ఆస్తులుగా మారిపోయాయి. ప్రైవేటు కంపెనీలుగా మిగిలిపోయాయి. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యం లో రాచరిక వ్యవస్థలను తలపింప జేస్తున్నాయి. అధినాయకత్వం మహారాజులుగాను, మిగిలిన వారంతా వారి సేవకులుగాను తయారయ్యారు.  ఆయా పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని “బానిసజనస్వామ్యం” గా విశ్లేసించవచ్చునేమో.  1980 ప్రాంతం లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత షేక్ అబ్దుల్లా తన కుమారడు ఫరూక్ అబ్దుల్లా ను వారసుని ప్రకటించడం తో మొదలైన జాడ్యం ఇప్పుడు దేశ రాజకీయ వ్యవస్థను చుట్టుముట్టేసింది. కాశ్మీర్ లో మొదలై కన్యాకుమారి వరకు విస్తరించేసింది. తెలుగుదేశం తో బలపడి డి ఎం కే, ఆర్జెడి, సమాజ్ వాది, జనతాదళ్ (ఎస్), టి ఆర్ ఎస్  లకు విస్తరించిన కుటుంబ పాలన రాజరికాన్ని తలపింప జేస్తున్నది.  కొత్త రూపుదిద్దుకున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కుడా అంతకు మినహాయిమ్పేమి కాదు. ఆది కుడా “ఎదిగింటి సందింటి” కుటుంబ సొత్తే. అయితే జయలలిత, మాయావతి, మమతల కు ప్రస్తుతం వైవాహిక కుటుంబాలు, వ్యక్తిగత వారసులు లేరు. వారి వ్యక్తిగత స్వామ్యం లోనే ఆ పార్టీలు నడుస్తున్నాయి. ఇప్పుడు జయకు వ్యక్తీ గత వారసుడు లేక పోవడం ప్రస్తుతం అన్నా డి ఎం కేకు ఇబ్బంది కరంగా తయారైంది. అందుకనే మమత, మాయావతి లు కుడా ముందుగానే జాగ్రత్త పడితే మంచిది

chandrababu-and-lokesh

తాజా గా కాంగ్రెస్ , వై ఎస్ ఆర్ కాంగ్రెస్  గత రెండు రోజులుగా లోకేష్ చర్యలను విమర్శిస్తున్నారు. లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం ను రాజ్యాంగేతర శక్తి గా నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు.   అయితే లోకేష్ పెత్తనం, జోక్యం చాల అధికంగా వుండటం ఆ పార్టీ లోని సీనియర్లకే ఇబ్బంది కరంగా వున్నట్టు తెలుస్తోంది. అయన వయస్సు, అనుభవం, సామర్ధ్యం కు మించి వ్యవహరించడం అటు అధికారులకు, ఇటు ఆ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదని అంటున్నారు. అట్లానే ఆయన చుట్టూ అవినీతి ఆరోపణలు చెలరేగుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి కంటే కుడా ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణాస్త్రాలు ఆయన పైనే అధికంగా ఎక్కుపెడుతున్నారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవించి వున్న కాలం లో జగన్ తెర ముందు కాన రాలేదు. ఎన్ టీ ఆర్ పాలనా కాలం లో కుడా ఆయన ఆల్లుళ్ళు పెత్తనం ఇంత రేంజ్ లో  పార్టీ  పైన ప్రభుత్వం పైనా  లేదు. ఎన్ టీ ఆర్ ఏ  అప్పుడు బాస్ గానే  కనిపించే వారు.  ఇప్పుడు అలా లేదు అని తెలుగు తమ్ముల్లే అంటున్నారు. గతం లో బాబు వర్గమనో,  డాక్టర్ గారి గ్రూపు అనో రెండు వర్గాలు ఉండేవి. ఆదిపత్యం కోసం పోరాడేవారు.  దాంతో అక్రమాలు పెద్దాయనకు తెలుస్తాయేమో ననే బయం వుండేది. కొందరు సీనియర్లు నేరుగా ఎన్ టీ ఆర్ తోనే సన్నిహితంగా వుండేవారు.  కాని ఇప్పుడంతా ఏక దృవం, ఏక గవాక్షం అయిపొయింది. దాంతో లోకేష్ కు తిరుగులేదు. ఆయనకు ఎదురు చెప్పే దమ్ము లేదు.  పార్టీ లో వున్న ఇద్దరు ముగ్గురు సీనియర్లు కుడా లోకేష్ పై బాబు వద్ద పెదవి విప్పడానికి కుడా జమ్కుతున్నారని తెలుస్తోంది. అయితే లోకేష్ కు ప్రస్తుతం ఎదురు ఉండక పోవచ్చును.  లక్ష్మి పార్వతి  స్థాయి కి లోకేష్ ఎదిగితే తప్ప దేశం లో ఎటువంటి ముప్పుకుడా రాక పోవచ్చును. బాబు కు  పరిస్థితిని ఆదుపులో ఉంచే సామర్ధ్యం వున్నది.  పుత్రవాత్సల్యం తో అధికప్రాదాన్యం ఇచ్చి అతి స్వేచ్చను కట్టబెట్టి దృతరాష్ట్ర ప్రేమను కనబరిస్తే  చరిత్ర పునరావృతమైనా ఆశ్చర్యపోనక్కరలేదు. అతి సర్వత్రా వర్జయేత్ అనేది  బాబు కు బాగా తెలుసు …

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *