Please Stop Begging Prakash Raj
Unique and Versatile Actor Prakash Raj has his own mark in the Industry.. అతని సినిమా అంటే ఒక ప్రత్యేకత… అతని విలక్షణతను నటనలోనే కాకుండా.. కథల ఎంపిక, దర్శకత్వంలో కూడా చూపెడుతున్నాడు. ఇప్పటికే ఆ విలక్షణతను చాటుతూ ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో పలు చిత్రాలు వచ్చాయి.. అలంటి చిత్రం “ఉలవ చారు బిర్యాని” పేరు కూడా విచిత్రం గా ఉంటుంది. ఆ కోవలో తాజాగా వచ్చిన “మనఊరి రామాయణం” మరో ఉదాహరణ. ఈ చిత్రం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నా.. ఆర్థికంగా మాత్రం వెనుకంజలోనే ఉంది. దీంతో సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాను అందరూ చూడాలని, మంచి సినిమాలను ఆదరించాలని తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు స్పందన బాగానే ఉన్నప్పటికీ ఒక అభిమాని మాత్రం విభిన్నంగా స్పందించాడు. ప్రకాష్ రాజ్ అంటే గొప్ప నటుడే కాక, దర్శకుడని అలాంటి స్థాయి కలిగిన వ్యక్తి ‘నా సినిమా చూడండి’ అంటూ అడుక్కోవడం తనను బాధించిందని సదరు అభిమాని రాశాడు. తీసిన వాళ్లకు సినిమా ఎప్పుడు బాగానే ఉంటుందని, కానీ సినిమా ఎలా ఉందో చెప్పాల్సింది ప్రేక్షకులు కానీ, సినిమా తీసిన వాళ్లు కాదని, నచ్చితే జనం తప్పకుండా చూస్తారని చురకలు సైతం అంటించాడు. దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అభిమానుల మనో భావాలు దబ్బతిన కుండ సినిమా ని ముందు తీసుకు వెళ్ళడం కుడా చాల ముఖ్యమైన విషయం.