నవ రాత్రు లలో ఈ కథ చదివితే సకల శుభాలు కలుగును

చదివితే…ఎంతో మంచిది

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరామ్‌

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్‌

నవరాత్రి ఉత్సవములలో దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామముతో మొదటిరోజున పూజలు, ఉపాసనలు చేస్తారు. పార్వతి, హైమవతి అనునవియును ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథననుసరించి, ఆమె హైమవతీ రూపమున దేవతల గర్వమును అనిచెను. వృషభవాహనారూఢయైన ఈ మాత కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

పూర్వజన్మమున ఈమె దక్షప్రజాపతికి పుత్రిక సతీదేవి కాగా, ఈమె పరమేశ్వరుని పెల్లిచేసుకుంటుంది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరించి, దానికి అందరిని పిలుస్తాడు. కాని పరమేశ్వరుడిని మాత్రం పిలవడు.తన తండ్రి మహాయజ్ఞమును చేస్తున్నాడని తెలిసిన సతీదేవి అక్కడికి వెళ్లాలని, తన పుట్టింటి వారిని అందరిని చూడాలని అనిపించి వెళ్లేందుకు అనుమతి ఇమ్మని ఆ పరమేశ్వరుడిని పట్టు పడుతుంది. ఆమె కోరికను కాదని అనలేక పరమేశ్వరుడు అనుమతించెను. కాని అక్కడకు వెళ్ళిన సతీదేవితో ఎవ్వరు మాట్లాడారు, పైగా తండ్రి దక్షుడు ఆమెను అవమానిస్తాడు. తన భర్త ఎంత వద్దని చెప్పిన వచ్చానని తలంచి , తన పతియైన పరమేశ్వరునకు జరిగిన ఈ అవమానమును ఆమె సహింపలేకపోయెను.

navratri-navadurga-story

వెంటనే ఆమె తన రూపమును అచటనే యోగాగ్నిలో భస్మమొనర్చెను. దారుణదుఖకరమైన ఈ సంఘటనను గూర్చి విని పరమశివుడు మిక్కిలి క్రుద్ధుడాయెను ఆయన తన ప్రమథగణములను పంపి దక్షుడు యజ్ఞమును పూర్తిగా విధ్వంసమొనర్చెను.సతీదేవి మరు జన్మలో శైలరాజైన హనుమవంతునకు పుత్రికగా అవతరించెను. ఇప్పుడామె శైలపుత్రిగా పెరుపొందెను.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *