Lokesh Fires on Chinarajappa?

సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి ……
ఆత్యంత కీలకమైన హోం మంత్రి కుడా…..
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు కుడా…. పార్టీలో ఆత్యంత విధేయుడు… విశ్వాస పాత్రుడు…. వ్యక్తిగతంగా సౌమ్యుడు … పెద్దమనిషి… అటువంటి వ్యక్తిని కేవలం ముఖ్యమంత్రి కొడుకుగా తప్ప మరో అర్హత లేని యువకుడు కళ్ళు ఎర్రజేసి నిలబెట్టి మరీ ప్రశ్నించడమా…? చినరాజప్ప స్వంత జిల్లా తూర్పుగోదావరిలో ఇదో పెద్ద చర్చనియామ్సమైంది…. లోకేష్ ప్రవర్తించిన తీరు కంటే ప్రతిపక్షం “పాపం …. రాజప్ప” అంటూ పరామర్శిం డం ఆయన అనుచరులను మరింత ఇబ్బందికి గురిచేస్తున్నది. “మొగుడు కొట్టిన దాని కంటే తోటికోడలు దెప్పడం మరింత బాద కలిగిస్తున్నది” అన్నట్టుగా తయారయ్యింది అనుచరుల పరిస్తితి. ఉదయం నుండి సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్న ఫోటో ను చూసి న వాళ్ళంతా ఎదో సీరియస్ వాగ్వాదం జరిగినట్టుందే అనే అభిప్రాయం తో వున్నారు. మందలించారేమోననే అభిప్రాయ పడేవారు లేక పోలేదు. చింత నిప్పుల లాంటి లోకేష్ కళ్ళు …. ఆవేదన తో నిండి వున్న రాజప్ప నేత్రాలు చూసిన వాళ్లకు ఎదో తీవ్ర సంఘటన జరిగిపోయిందని అనిపిస్తుంది.

lokesh-chinarajappa

కాని వాస్తవమేమిటనేది తెలియడం లేదు. చినబాబు ప్రసంగిస్తున్నప్పుడు మొదటి వరుసలో కూర్చున్న మంత్రులు యనుమల, నారాయణ, రాఘవరావు లాంటి వారు ఎదో చర్చించుకుంటున్నారు.. మంత్రులు రాజప్ప, అచ్చెన్నాయుడు లాంటి వారు కునుకు తీస్తున్నట్టు మరో ఫోటోలో స్పష్టం గా కనిపిస్తున్నది. అంతేకాదు హాలు లోని ఆత్యదిక శాతం కుర్చీలు ఖాళీ కుడా అయిపోయాయి. దాంతో అవమానంగా భావించిన చినబాబు మిగిలిన పలుకుబడి కలిగిన మంత్రులను విడిచిపెట్టేసి “ నోరువాయలేని చినరాజప్ప పై విరుచుకు పడ్డారా …? అని కుడా ఉహించుకొనే వారు లేక పోలేదు. కాని అది ఎదో వాగ్యుద్దమే జరిగితే అక్కడే వున్న ఇతర మంత్రులు స్పందిచరా? అనేది కుడా అలోచించాల్సిందే. ఇదే ఫోటోలో కనిపిస్తున్న ఇతర మంత్రులు ఎవరి పనిలో వారున్నట్టు కుడా కనిపిస్తున్నది.. … అయితే మాజీమంత్రి వై ఎస్ ఆర్ సిపి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇదే విషయంపై చేసిన విమర్శతో ఫోటో వివాదానికి మరింత ప్రాధాన్యత కలిగింది. “సీఎం తనయుడు నారా లోకేశ్ ప్రభుత్వాన్ని శాసిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని బొత్స ఆరోపించారు. లోకేశ్ ముందు డిప్యూటీ సీఎం చినరాజప్ప వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇక ఆయన మాటలు పోలీసులు ఏం వింటారని అన్నారు. లోకేశ్, చినరాజప్ప ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పాలన ఎటుపోతోందని బొత్స సత్యనారాయణ పశ్నించారు. అంతేగాకుండా స్వంత సామాజిక వర్గం లో ఈ సంఘటన రాజప్పను మరింత పలచన చేసిందంటున్నారు.

Comments

comments

You may also like...