లక్ష్మి దేవి అనుగ్రహం కావాలి అంటే ఈ దీపావళి కి ఇలా చెయ్యండి

దీపావ‌ళి అన‌గానే సాధార‌ణంగా అంద‌రికీ ట‌పాకాయ‌లే గుర్తుకు వ‌స్తాయి. కానీ ఆ రోజు చాలా మంది ల‌క్ష్మీ పూజ కూడా చేస్తారు. దీపావ‌ళి వెలుగు దివ్వెల్లాగే త‌మ జీవితాల్లోనూ సుఖ సంతోషాలు నిండాల‌ని, అష్టైశ్వ‌రాలు క‌ల‌గాల‌ని అంద‌రూ ల‌క్ష్మీ దేవిని ప్రార్థిస్తారు. అయితే కేవలం ఆ రోజే కాకుండా దానికి ముందు వారం పాటు ల‌క్ష్మీ దేవిని పూజించాల‌ట‌. కానీ పూలు, పండ్లు, అర్చ‌న‌ల‌తో కాదు, కేవ‌లం పాల‌తో ఆ దేవిని పూజించాల‌ట‌. అదేంటీ వింత‌గా, ఆశ్చర్యంగా ఉంది, అనుకుంటున్నారా..? ఈ క్రింది విధం పాటించండి..  పాల‌తో ల‌క్ష్మీ దేవిని ఎలా పూజించాలో, దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

diwali-pooja
దీపావ‌ళికి స‌రిగ్గా వారం ముంద‌ట ఒక రోజు సాయంత్రం పూట ఒక లీట‌రు పాల‌ను కొని తేవాలి. దాంట్లో కొద్దిగా తేనె, గంగాజ‌లం (శుద్ధ‌మైన మంచినీరు) క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని రెండు భాగాలు చేయాలి. ఒక భాగంతో స్నానం ఆచ‌రించాలి. మ‌రో భాగాన్ని తీసుకుని అందులోని మిశ్ర‌మాన్ని ఇంటి క‌ప్పు మీద‌, ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌, ఇత‌ర గ‌దుల్లో చిల‌క‌రించిన‌ట్టు చ‌ల్లాలి. అందులో కొంత మిశ్ర‌మాన్ని మిగిలించి దాన్ని మ‌ళ్లీ ప్ర‌ధాన ద్వారం ప‌క్కన పార‌బోయాలి. ఇలా దీపావ‌ళికి వారం ముందు నుంచి దీపావ‌ళి వ‌చ్చే వ‌ర‌కు చేయాల్సి ఉంటుంది. దీంతో అనేక శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.

పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవిని పూజించిన‌ట్టు అవుతుంద‌ట‌. దీంతో అలా చేసిన వారి ఇంట్లో చెడు శ‌క్తి పోయి (negative energy), మంచి శ‌క్తి  (positive energy) వ‌స్తుంద‌ట‌. ఇంట్లో అంద‌రికీ అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట‌. ధ‌నం బాగా స‌మ‌కూరుతుంద‌ట‌. వారిని లక్ష్మీ దేవి అనుగ్ర‌హించి అన్ని సంప‌ద‌ల‌ను ఇస్తుంద‌ట‌. ధ‌నం లేని వారికి ధ‌నం ఇస్తే, అది ఉన్న వారికి శుభ ఫ‌లితాల‌ను క‌లిగిస్తుంద‌ట‌. ఈ క్రింద పద్యం మన అందరికి తెలిసినదే కాని మీకోసం ఆంధ్రాసైట్.కాంమ్ అర్థం తో సహా అందిస్తోంది… చదువుకొంటూ పూజ చేస్తే ప్రయోచనం అధికం గా ఉంటుంది.

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం  
ప్రతి పదార్ధం:
లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద  = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల  రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం= పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.
తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *