Its really unfair practice to make “Surgical Strikes” Political

“రైతు తన పంటను కాపాడుకున్నంత భద్రంగా సైన్యం దేశాన్ని రక్షిస్తున్నది” అని కేంద్ర హోం మంత్రి రాజనాద్ సింగ్ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. ఎవరు అధికారం లో వున్నా ఈ దేశ రక్షణ బారాన్ని  మోస్తూ కంటికి రెప్పలా …. కంటిపై కునుకు లేకుండా…  బిలియన్ పావు జనాన్ని కాపాడుతున్నది సైన్యమే. బారతీయ  సైన్యం త్యాగాన్ని, సమర్ధతను,  సశ్చిలతను, క్రమశిక్షణ ను ఏ ఒక్కరు ప్రశ్నించలేరు. పాలకులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను కాపాడేందుకు అంతర్గత, బహిర్గత  శత్రువులతోను చివరకు ప్రకృతి తో కుడా    పోరాడుతూ ప్రతీ ఏటా వందలాది వందలాది ప్రాణాలను కోల్పోతున్నా కర్తవ్యాన్ని విడనాడని అత్యుత్తమ సైన్యం బారత్ సొత్తు. దేశ రక్షణ కోసం ఎప్పుడు ఎట్లా స్పందించాలో దానికి తెలుసు. జాంబవంతుడు హనుమంతునికి తన శక్తిని  గుర్తు చేసినట్టు సైన్యానికి ఏ ఒక్కరు కర్తవ్యాన్ని,  శక్తి యుక్తులు గురించి చెప్పనక్కరలేదు. ప్రపంచం లో నే అత్యుత్తమ సైన్యంలలో ఒకటిగా కీర్తిపొందిన భారత్ సైన్యం ఆక్రమిత కాశ్మీర్ లో చేపట్టిన  “సర్జికల్ స్ట్రైక్స్“ దేశ రాజకీయాల నోట్లో నానడం బాధకలిగిస్తున్నది. పాక్ దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ బారత్ కు అండగా నిలిచినా సార్క్ సభ్య దేశాలు ఈ అంతర్గత రాజీయ కుమ్ములాటు గురించి విని ఏమను కుంతాయో ఒక్కసారి ఉహించుకోండి రాజకీయ నేతలారా …! ఇరుగు పొరుగువారు అండగా నిలుస్తుంటే …. ఇంట్లో వాళ్ళే తన్నుకోవడమేమిటి …?

          “సర్జికల్ స్ట్రైక్స్“  రాజకీయ రంగు పులుముకున్నాయి. సైన్యం విజయాన్ని తమ ఖాతాలో వేసేసుకొవాలని పాలక పక్షం ప్రయత్నించడం, దానిని తిప్పికొట్టేందుకు విపక్షం విమర్శలు చేయడం ….  తమ మీద బురద జల్లితే సైన్యం మిద జల్లినట్టే నంటూ అధికార పార్టీ  విరుచుకు పడటం తో వాగ్యుద్ధం కనిష్ట స్థాయికి దిగజారిపోయింది. “సర్జికల్ స్ట్రైక్స్“ ను కాంగ్రెస్ తో సహా అన్ని పక్షాలు సమర్ధించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొని అన్నిపక్షాలు సైన్యం చేసిన దాడులను కొనియాడుతూ మద్దత్తు పలికాయి. భారత జాతి యావత్తు సైన్యానికి బాసటగా నిలిచింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అయితే ప్రదాని మోడీ “ప్రదాన మంత్రి” గా  ఇన్నాళ్ళ తరువాత వ్యవహరించారని కితాబు కుడా ఇచ్చారు. అదే రాహుల్ కొద్ది రోజులలోనే మోడిని “దలాలి” అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆమాద్మి పార్టీ కుడా ముందు మోడిని పొగిడి తరువాత  బిజెపి రాజకీయాన్ని తప్పు పట్టింది. దాంతో బిజెపి ఆ పార్టీలను “భారత్ సైన్య వ్యతిరేకులు – పాకిస్తాన్ మిత్రులు – దేశ ద్రోహులు” అంటూ రాజకీయ ‘స్ట్రైక్స్’ మొదలెట్టింది. దాంతో అధికార విపక్షాలు పరస్పరం నిత్యం జల్లు కొంటున్న  బురద చివరకు సైన్యం పై కూడా పడింది.            కాగా “సర్జికల్ స్ట్రైక్స్“ వల్ల దేశం లో అనూహ్యంగా వెల్లువెత్తిన బావోద్వేగాల వల్ల లబ్దిపొందాలని బిజెపి ఆశ పడింది. ఇది సహజమే. ప్రతీ పాలకపక్షం చేసే పనే ఇది. దానిని కొంత వరకు సమర్ధించ వచ్చు. బంగ్లాదేశ్ ను విముక్తి చేసిన నాటి ప్రదానిని అప్పటి కాంగ్రెస్ ఆదిశక్తి గా కీర్తించింది.    అయితే ఇప్పుడు  కొందరు మంత్రులు అతిగా స్పందించారు. అంతే గాకుండా వచ్చే సంవత్సరం ఉత్తర ప్రదేశ్ లో జరుగబోతున్న

ఎన్నికలలో “సర్జికల్ స్ట్రైక్స్“ ను ఓట్ల ను తెచ్చి పెట్టె ఆయుదాలుగా మార్చుకోవాలనే వ్యూహాన్ని రచించారు. దాంతో ఒక్కసారిగా సైన్యం చర్యకు రాజకీయ చేద పట్టేసింది. ప్రదాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం వల్లనే దాడులు జరిగాయని, లేకపోతే సైన్యం స్పందించేది కాదని, ఈ దాడులు చేయించడం వల్ల మోడీ చాతీ అరవై నుండి వంద అంగుళాలకు పెరిగిపోయిందంటు బిజెపి నేతలు ఉకదంపుడు ఉపన్యాసాలు,  ప్రకటనలు మొదలు పెట్టేసారు. అంతే కాదు మరో ఘోర తప్పిదమేమిటంటే రక్షణ మంత్రి మనోహర్ పారీకర్   హనుమంతుడుతో పోలుస్తూ అక్టోబర్ 1న  చేసిన  ప్రకటన. “తన శక్తి ఏమిటో జామ్భవంతుడు గుర్తుచేయడం వల్లనే హనుమంతుడు  ఒక్క అంగలో సముద్రాన్ని దాటగలిగాడు. హనుమంతుడు మాదిరిగానే సైన్యం కుడా సర్జికల్ స్ట్రైక్స్ చేయిగాలిగాయి” అని అంటూ పరోక్షంగా మోడీ చెప్పడం వల్లనే సరిహద్దు దాటాయని ప్రదానికి  భుజానికి కీర్తులు తగిలించారు రక్షణ మంత్రి.  ఇటువంటి దాడులు గతం లో ఎప్పుడు చేయలేదని కుడా రక్షణ మంత్రి గొప్పగా కితాబు ఇచ్చుకున్నారు. దానికితోడు విజయవంతం గా సర్జికల్ స్ట్రైక్స్ చేసినందుకుగాను త్వరలో ఎన్నికల సమరం జరగనున్న ఉత్తరప్రదేశ్ గడ్డ పైనే లక్నో, ఆగ్రాలలో పారీకర్ ను బిజెపి శ్రేణులు ఘనంగా సన్మానించాయి. మోడిని కీర్తిస్తూ యుపి అంతటా ఫ్లేక్షిలు వెలిసాయి. విస్తృతంగా పత్రికా ప్రకటనలు వెలువడ్డాయి. ఈ చర్యలు ప్రతిపక్షాల రాజకీయాగ్నిలో ఆజ్యం పోశాయి.  అంతే … ప్రతిపక్షాలు ఎదురు తిరిగాయి. “సైన్యం చిందించిన రక్తం తో మోడీ లాభం పొందే దలాలి” రాహులు తీవ్రంగా విమర్శించారు. తమ పార్టీ పాలనలోకుడా  ఇటువంటి దాడులు అనేకం  నిర్వహించామని రాహులు చెప్పుకున్నారు. అప్పటి రక్షణ మంత్రులు చిదంబరం, శరద్ పవార్లు కుడా ఇదే మాట చెప్పారు. సర్జికల్ స్త్రిక్స్ ఎప్పుడు జరగలేదని యు పీ ఏ పాలన లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆర్గనైజేషన్ గా పనిచేసిన వినోద్ భాటీయా  వెల్లడించారు. ఇదే సమయం పాక్,  బారత్ తన భూబాగం లో ఎటువంటి దాడులు చెయ్యలేదని  ప్రపంచం ను నమ్మించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. దాంతో మిలిటరి చేసిన దాడుల విడియో లను బహిర్గతం చెయ్యాలని ఆప్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు వంత పాడాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వీళ్ళెవరు సైన్యం ను తప్పు పట్టడం లేదు. కాని విషయాన్ని బిజెపి సైన్యం మీదకు తిప్పి ప్రతిపక్షాలను సైన్యం వ్యతిరేకులుగా చిత్రించింది. విమర్శలు, ప్రతివిమర్శలు జాతి తలదించుకొనే అంతటి నిచస్తాయికి దిగజారిపోయాయి. ఈ నేపధ్యం లో సైన్యం విడియో లను ప్రభుత్వానికి అందజేసినట్టు వార్తలొచ్చాయి. అయితే వాటిని బయట పెట్టడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఈ విమర్శల ఎన్ కౌంటర్ లతో విచిగి పోయిన మోడీ ఇక “చాతీలు చరుసుకోవడం” మానేయన్దంటూ తన సహచరులకు సూచించారు. హోం మంత్రి రాజ్ నాద సింగ్ కుడా నిన్న జైపూర్ లో సంయమనం పాటించమని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసారు. అయితే బిజెపి అధినేత అమిత్ షా  డిల్లి లో ప్రెస్ మీట్ పెట్టి రాహులు కు కౌంటర్ ఇచ్చారు. వెంటనే  కాంగ్రెస్ తరుపున కపిల్ సిబాల్ ఎన్ కౌంటర్ చేసారు. వెనువంటనే కేంద్ర మంత్రి రావిశంకర్ ప్రసాద్ సిబాల్ పై విరుచుకు పడ్డారు. ‘హనుమంతుడు వ్యాఖ్యలు చేసిన రక్షణ మంత్రి పరీకర్ పై  ఆప్ పార్టీ డిల్లి శాఖ అధ్యక్షుడు డిల్లీ పోలీసులకు పిర్యాదు చేసారు. ఇక యుపీ లో మాజీ ముఖ్యమంత్రి మాయావతి మరో సంచలన ప్రకటన చేసారు. “సర్జికల్ స్ట్రైక్స్ ను ఆదారం గా చేసుకొని  మత విద్వేషాలను రెచ్చగొట్టి రాబోయే ఎన్నికలలో విజయం సాదించడానికి బిజెపి కుట్ర  పన్నుతుందని మాయావతి ఆరోపించారు. 2014  లోక్ సభ ఎన్నికలలో కుడా బిజెపి  మత విద్వేషాలను రెచ్చగొట్టే విజయం సాదించిందని ఆమె ఆరోపించారు.

          దేశం ఎదుర్కొంటున్న తీవ్రవాద సమస్యను అంతమొందించేందుకు సైన్యం చేసిన దాడులు చివరకు యుపి ఎన్నికల  రాజకీయ అగ్ని గుండం లో పడి మసక బారిపోయాయి.  ఇది దేశ భద్రత తో ముడిపడిన వ్యవహారం. అందరూ కలసికట్టుగా సైన్యానికి అండగా నిలిచి ముందుకు నడపాల్సిన తరుణమిది.  ఏకాభిప్రాయం అవసరం. దాడుల పై మొదట అన్ని పక్షాలు ఒకే మాట పై ఉన్నాయి. అదే విధంగా ఇక ముందు కుడా కొనసాగాలి. కొద్ది రోజులుగా జరుగుతున్న ఆరోపణలను ఇరుపక్షాలు తక్షణం నిలిపివేయాలి. ప్రదానమంత్రి, హోం మంత్రి తాము చేసిన ప్రకటనలకు కట్టు పడాలి. తమ వాళ్ళను అదుపు చెయ్యాలి.  ప్రభుత్వాన్ని విమర్శిచేవాల్లందరినీ దేశద్రోహులు అంటూ విమర్శించడం పాలకపక్షం మానుకోవాలి. విపక్షం కుడా రాజకీయాలు మాని సంయమనం తో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి.  ప్రభుత్వ అనుకూల మీడియా కుడా గోరంతలు కొండతలు చేసి చూపకుండా వుంటే దేశం లోని అన్ని పక్షాలు ప్రశాంతంగా వుంటాయి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *