FB అకౌంట్ ను స్పామ్ నుంచి కాపాడుకోవాలంటే ఇలా చేయండి..!!

ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్ లో స్పామ్ విపరీతంగా వస్తోంది. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే మనకు తెలియకుండానే మన అకౌంట్ నుండి మన ఫ్రెండ్స్ కి వీడియో లింక్ వెళ్లడం, దానిని ఓపెన్ చేసిన వారి అకౌంట్ నుండి వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్ కు ఈ వీడియో లింక్ వెళ్లడం.. చూస్తూనే ఉన్నాం. ఈ లింక్స్ అసభ్యంగానూ, వారి వారి ఫేస్ బుక్ ఎకౌంట్ ను కరప్ట్ చేసేవిగానూ ఉంటున్నాయి. దీంతో చాలా మంది గందరగోళపడుతున్నారు. అందుకే కింద చెప్పిన విధంగా ఫాలో అవుతూ మీ FB అకౌంట్ ను స్పామ్ నుండి కాపాడుకోవొచ్చు.

మీ అకౌంట్ స్పామ్ బారినపడకుండా ఇలా చేయాలి:
* మీ ఇన్ బాక్స్ కి ఏదైనా అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే ఓపెన్ చేయకుండా Shift+Cntrl టైప్ చేస్తే ఓ ఇన్ కాగ్నిటివ్ డొమైన్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ మెసేజ్ ను చూడొచ్చు. ఒకవేళ అది స్పామ్ మెసేజ్ అయితే ఆ ట్యాబ్ క్లోజ్ చేయగానే మళ్లీ మెయిన్ డొమైన్ లోకి వచ్చేస్తారు. కాబట్టి మన అకౌంట్ స్పామ్ కు గురికాదు.
* ఏ ఫోన్ లో పడితే ఆ ఫోన్ లో, ఎక్కడ సిస్టమ్ దొరికితే అక్కడ FB ఓపెన్ చేయకూడదు. మీ పర్సనల్ కంప్యూటర్ లో , ఫోన్ లో మాత్రమే ఫేస్ బుక్ ని ఓపెన్ చేయండి.
* FaceBook పేరు మీద ఫేక్ వెబ్ సైట్స్ ఉంటాయి. ఫేస్ బుక్ అనే పేరును వాడుకొని దాని వెనకో ముందో ఇంకో పేరు ఉంటుంది.( https://www.facebook.com -ఇది FB Original URL), ఇలా బురిడీ కొట్టించేలా సైట్లు ఇచ్చేదానినే ఫిషింగ్ అంటారు. ఓ ఫేమస్ వెబ్ సైట్ ను కాసింత మార్చి, అదే లుక్ తో క్రియేట్ చేస్తారు. వాటితో కాసింత జాగ్రత్తగా ఉండాలి.
* ఇన్ని చేసిన మన FB అకౌంట్ నుండి స్పామ్ వెళ్లింది అనుకుంటే వెంటనే మన యాక్టివిటి లిస్ట్ ఓపెన్ చేసి, మన ప్రమేయం లేకుండా పోస్ట్ అయిన పోస్ట్స్ ను డిలేట్ చేయాలి. తక్షణం పాస్ వర్డ్ ఛేంజ్ చేయాలి. పాస్ వర్డ్ పెట్టుకునేప్పుడు అది కాస్త కఠినంగా ఉండే అక్షరాలు, పదాలతో సూచించేది అయి ఉండాలి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *