Can you Guess his age?

అతడికి నూట నలభై ఐదేళ్ళు! నమ్మశక్యంగా లేదు కదూ! ఇది నిజంగా నిజమే. ఎందుకంటే ఈ సూపర్‌ సీనియర్‌ సిటిజన్‌ వయసును ఇండోనేసియా ప్రభుత్వం ధృవీకరించింది. ఇతడి పేరు Mbah Gotho. సెంట్రల్‌ జావాలోని Sragen గ్రామ నివాసి. ప్రభుత్వ అధికారులు గుర్తించిన అధికారిక డాక్యుమెంట్ల ప్రకారం 1870 డిసెంబరు 31వ తేదీన గొథో జన్మించాడు. అతని తోబుట్టువులు పదిమందీ మరణించారు. అతడి నలుగురు భార్యలూ మర ణించారు. అతడి చివరి భార్య 1988లో మరణిం చింది. అతని కొడుకులు, కోడళ్ళు అందరూ మరణిం చారు. ఇప్పుడు గొథో తన మునిమనుమలు, ముని ముని మనుమలతో కలిసి ఉంటున్నాడు. గొథో ఇప్ప టికీ తన పనులు తానే చేసుకుంటాడు. అన్ని రకాల ఆహారం తింటాడు. ఇప్పటివరకూ జబ్బుపడిన పాపాన పోలేదు! హాయిగా నడుస్తాడు. కాకపోతే నడుము కొంచెం ఒంగిపోయిందంతే! నడిచేటప్పుడు ఎవరి సహాయం అతనికి అవసరం లేకపోవడమే ఈ వృద్ధుడి ప్రత్యేకత. ఐతే వెరిఫికేషన్‌ లేకుండా చూస్తే, ఇతడికంటే వృద్ధులైన 171 ఏళ్ళ నైజీరియా వాసి జేమ్స్‌ ఓలో ఫింటుయి, ఇథియోపియాకి చెందిన 163 ఏళ్ళ ధాక్వాబో ఎబ్బా, 122 ఏళ్ళ ఫ్రెంచ్‌ మహిళ Jeanne Calment సజీవంగానే ఉన్నారు.
oldest-man-on-earth

సెప్టెంబరు 20వ తేదీన ‘లిపుటన్‌ 6 టెలివిజన్‌ న్యూస్‌ ఛానల్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘నేను చనిపోవాలనుకుంటున్నా, నా మునిమనుమలు, మునిముని మనుమలు అంతా పెద్దవారైపోయారు’ అన్నాడు గొథో. ఆయన ఏం పెట్టినా తింటాడనీ, తమకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ గొథో మునిమను మడు సుర్యాంటో చెప్పాడు. ‘మా ముత్తాత తన 122వ సంవత్సరం నుండి చనిపోవడానికి సిద్ధం గానే ఉంటున్నాడు, మరణం ఎప్పటికీ ఆయన చెంతకు రాదనే అనిపిస్తోంది’ అంటున్నాడు సుర్యాంటో. 1992లోనే మా తాతల సమాధుల పక్కన ఒక సమాధి సిద్ధం చేసి ఉంచి ఇప్పటికి 24 సంవత్స రాలైంది’ అంటున్నాడతను. ఇంతకాలం మీరు సజీ వంగా ఉండటానికి కారణం ఏమిటి? ఆ రహస్యం ఏమిటి? అని టీవీ వాళ్ళు ప్రశ్నిస్తే, ‘నా సహనమే నా మనుగడ రహస్యం’ అన్నాడు గొథో!

Comments

comments

You may also like...