వేల కోట్లకి అధిపతి అయినా వాడేది సెకండ్ హ్యాండ్ కారే!

azim-premjiవిప్రో కంపెనీ అధినేత, వేల కోట్లకి అధిపతి, దాదాపు 12 వేల కోట్ల రూపాయల సొంత డబ్బుని ఇండియాలో విద్య అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న అభినవ కర్ణుడు అజీం ప్రేమ్ జీ, సెకండ్ హ్యాండ్ కారు వాడతారు అంటే నమ్మగలమా? కాని ఇది నిజం.
ప్రేమ్ జి కోరుకుంటే, క్షణాల్లో ప్రపంచం లోనే అత్యంత ఖరీదయిన కారు కొనుక్కోగలరు. కాని తను సంపాదించేది, తిరిగి సమాజానికి ఇవ్వడానికే అని మనసా, వాచా కర్మణా నమ్మిన ఈ మహానుభావుడు, ఒక మామూలు కోటీశ్వరుడు కొనుక్కోగలిగిన ‘టయోట కరోల’ కారుని వాడతారు. ఇది కాకుండా ఎప్పుడయినా ఉపయోగించుకోవడం కోసం మెర్సిడెస్ బెంజ్ ఇ సిరీస్ కారు కొనుక్కున్నారు. ఈ కారు కొత్తది కొనుక్కోవాలంటే 50 లక్షలు అవుతుంది, ఈ మాత్రం కూడా తన కోసం ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేని ఈ మహామనిషి, ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారట. ఎంత గొప్ప మనసో కదా.. అంతేనా..
కూల్ డ్రింక్స్ తాగండి ఆరోగ్యం పాడుచేసుకోండి అని ప్రకటనల్లో నటించే స్టార్లు, తమ ఆరోగ్యం విషయం లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. కాని, అజీమ్ ప్రేమ్ జీ మాత్రం, ఇప్పటికీ తమ కంపెని తయారు చేసే చంద్రిక సబ్బునే షేవింగ్ క్రీమ్ లాగా ఉపయోగిస్తారట. ఎందుకిలా అంటే, మన కంపెని తయారీసబ్బుని మనమే వాడకపోతే ఎలా అని ప్రశ్నిస్తారట ఈ కర్మయోగి.
నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ గొప్ప మనసుకు ఒక సెల్యూట్ కొడదాం!

Comments

comments

You may also like...