60 జిల్లాలు ఇక ఏపీ లో

and

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిని చూసి ఒకరు పోటీ పడి మరీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇక అభివృద్దిలో పోటీ పడేందుకు అంతర్గతంగా యుద్దమే చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం అంటూ పది ఉన్న జిల్లాల సంఖ్యను ఏకంగా 31కి పెంచిన విషయం తెల్సిందే. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచడంతో ప్రస్తుతం ఏపీలో జిల్లాల సంఖ్య పెంచే యోచనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తొస్తోంది. భారీగా ఏపీలో జిల్లాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది.
ప్రస్తుతం ఏపీలో ఉన్న జిల్లాల సంఖ్యను 60కు పెంచాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన మాదిరిగా కాకుండా విభిన్నంగా జిల్లాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు ప్రజల నుండి వినతులు తీసుకుని వాటిపై తుది నిర్ణయంను తీసుకునేందుకు ఒక కమిటీ వేయాలని, ఆ కమిటీ జిల్లాల సంఖ్యను, ఏ జిల్లాలను ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తుందని అంటున్నారు. రెవిన్యూ డివిజన్‌లను జిల్లాలుగా మార్చే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు మరింతగా వెళ్లేందుకు జిల్లాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం అతి త్వరలోనే కార్యచరణ మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

comments

You may also like...