3 మినిట్స్ లో నిద్ర వస్తుంది ఇలా చేస్తే

మంచంపై అలా నడుం వాల్చగానే నిద్ర పట్టడం నిజంగా అదృష్టంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎందరో నిద్ర కోసం కుస్తీలు పడుతున్నారు. కానీ కింద చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేసిన వారిని నిమిషాల్లో నిద్రాదేవి ఆవహిస్తుంది. మంచి నిద్ర కోసం ఇలా చేయండి..

శ్వాస సక్రమంగా తీసుకుంటున్నారా?:
విపరీతమైన ఒత్తిడి, ఆందోళనతో ఉండేవాళ్లు ఊపిరి పీల్చడం మీద దృష్టి నిలపరు. గుండెల నిండా గాలి పీల్చకపోగా కొన్ని క్షణాల పాటు గాలి పీల్చడమే ఆపేస్తుంటారు. ఇదే పరిస్థితి రాత్రివేళ వారిని నిద్రపోకుండా అడ్డుకుంటూ ఉంటుంది. శరీరం మంచి రిలాక్సేషన్ లోకి రావాలంటే గుండె వేగం తగ్గి మనసు ప్రశాంతం అవ్వాలి. ఇలా జరగాలంటే అందుకు తగినంత ఆక్సిజన్ శరీరానికి అందాలి. ఈ సూత్రంతో తయారైందే ‘మైండ్ ఫుల్ బ్రీతింగ్’
మైండ్ ఫుల్ బ్రీతింగ్ ఇలా చేయాలి:
నిటారుగా కూర్చుని 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలి లోపలికి పీల్చుకోవాలి. అలాగే ఆ గాలిని 7, 8 సెకన్ల పాటు పట్టి ఉంచాలి. తర్వాత నోటి ద్వారా 8 సెకన్ల పాటు గాలిని బయటికి వదిలేయాలి. మొదట్లో గబా గబా అంకెలు లెక్కపెట్టేయడం, 2వసారి ప్రాక్టీస్ చేయడానికి బద్దకం అనిపించడం లాంటి ఇబ్బందులు మామూలే.. కాని పట్టుదలగా మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తే సరిగ్గా 3, 4 నిముషాల్లోనే నిద్రలోకి జారుకుంటారు. అది కూడా గాఢంగా నిద్రపట్టే అవకాశం ఉంది. మైండ్ ఫుల్ బ్రీతింగ్ కారణంగా మనసు ప్రశాంతంగా మారి మగత నిద్ర పట్టే గొప్ప ఛాన్స్ కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం బెడ్ ఎక్కడానికి ముందు.. ట్రై చేసి చూడండి..

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *