2000 రూ నోటు త్వరలో మరి 500 ,1000 నోట్లు లేనట్టేనా ….,

10 500

త్వరలో రూ 2000 నోటు చలామణి లోకి రానుంది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు పూర్తీ చేసింది. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని అధిక విలువ కలిగిన నోట్లకు డిమాండ్ పెరగడంతో రూ 2000 నోటును విడుదల చేయాలని ఆర్ బి ఐ నిర్ణయించింది. ఇప్పటికే ఈ నోట్ల ముద్రణ పూర్తయింది. ఇప్పటివరకు రూ 1000 నోటు అధిక కరెన్సీ నాటుగా చలామణి లో ఉంది. ఇప్పుడు ఈ స్థానాన్ని రూ 2000 నోటు ఆక్రమించనుంది. ఒక వైపు దేశంలో నల్లదనం అరికట్టడానికి రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ వస్తున్నా నేపధ్యంలో ఆర్ బి ఐ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

పరోక్షంగా దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు పలుకుతునదని వేరే చెప్పనక్కరలేదు. గతంలో మన కరెన్సీ లో  రూ 10000, రూ 5000, రూ 1000 నోట్లు ఉండేవి. అయితే నల్లదనం అరికట్టడానికి 1978 లో ఈ నోట్లను రద్దు చేసారు. తిరిగి 2000 సంవత్సరం లో రూ 1000 నోటును ప్రవేశపెట్టారు. ఒక వైపు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరగడంతో కొత్త నోట్ల ముద్రణ ఆర్ బి ఐ కి తలకు మించిన భారంగా తయారయింది. చిన్న నోట్ల ముద్రణా వ్యయం తక్కువగా ఉండడం తో అధిక విలువ గలిగిన నోట్లు ముద్రణకే ఆర్ బి ఐ మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం రూ 1000 నోటుకు రూ 3 రూపాయలు ఖర్చు  అవుతుంది. ఇదే అతి తక్కువ ముద్రణా వ్యయం.

Comments

comments

You may also like...