మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూసేయవచ్చు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎలానో తెలుసుకోండి

ప్రస్తుతమున్న ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ప్రతి ఒక్క పని సులభంగా జరిగిపోతుంది. ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చొని అరచేతిలో మొబైల్ లో చుసేయ్యొచ్చు. అయితే ఇప్పుడు ప్రపంచం బయట మాత్రమే కాదు ఇంట్లో జరిగేవి కూడా చూసుకునే సౌకర్యం ఇప్పుడొచ్చింది. దీని కోసం ప్రతి ఇంట్లో సీసీ కెమెరాల అవసరమూ పెరిగింది.
అయితే ఇప్పుడున్న టెక్నాలజీ తో సీసీ కెమెరాలు లేకుండానే మీరు వాడే స్మార్ట్ ఫోన్ నే సీసీ కెమెరాగా మార్చేయొచ్చని తెలుసా. దీని కోసం ప్లే స్టోర్‌, ఆప్‌ స్టోర్‌లో కొన్ని ఆప్స్‌ ఉన్నాయి. వాటిని మీ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకొని మీ స్మార్ట్‌ఫోన్‌నే సీసీ కెమెరాగా, రిసీవర్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీ దగ్గర రెండు ఫోన్లు ఉండాలి. ఉదాహరణకు Free Wi-Fi Camera ఆప్‌ విషయానికొస్తే…

ఈ ఆప్‌ను రెండు ఫోన్లలోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత రిసీవర్‌గా, రికార్డర్‌గా ఒక్కో ఫోన్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఓ గదిలో ఫోన్‌ని పెట్టి రికార్డు చేస్తూ, మీరు మరో గదిలో ఉండి వేరే ఫోన్‌లో చూసుకోవచ్చు. ఐఫోన్‌ వినియోగదారులైతే Manything home security camera ఆప్‌ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. ఈ సింపుల్ టెక్నాలజీ తో మన ఇంట్లో జరిగే విషయాలన్నీ సిసి కెమెరా పెట్టి రికార్డు చేసుకోవచ్చు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *