స్మార్ట్‌ ఫోన్‌ అతి చిన్నది

నిన్న మొన్నటి వరకు స్మార్ట్‌ ఫోన్‌లు ఎంత పెద్దగా ఉంటే అంత హోదా అని భావించేవారు. అందుకే స్క్రీన్‌ పెద్దగా ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లకు గిరాకీ ఎక్కువగా ఉండేది. అందుకే పలు కంపెనీలు 6, 7 అంగులాలతో స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేశారు. ఇక ప్రస్తుత యువత అంత ఫోన్‌ను క్యారీ చేసేందుకు చిరాకుగా ఉంది అని, చిన్న ఫోన్‌ ఉంటే బాగుండు అని భావిస్తున్నారు. వారి కోరిక మేరకు చైనాకు చెందిన ఒక సంస్థ అతి చిన్న స్మార్ట్‌ పోన్‌ను తయారు చేసింది. ఇది కేవలం 1.54 అంగులాలు మాత్రమే ఉంటుంది.
ఇటీవలే ఈ అతి చిన్న స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల అయ్యింది. ఇండియాలో ఇంకా రిలీజ్‌ కాలేదు కాని, చైనా మార్కెట్‌ను ఈ ఫోన్‌ ముంచెత్తుతుంది. కేవలం రెండు వేల రూపాయలకే ఈ ఫోన్‌ మార్కెట్‌లో లభిస్తుంది. అయితే ఈ ఫోన్‌ రామ్‌ మరియు స్టోరేజీ చాలా తక్కువగా ఉంది. 64 ఎంబీ ర్యామ్‌ మరియు 128 ఇంటర్నల్‌ మెమోరీ ఉంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో ఈ ఫోన్‌ పని చేస్తుంది. కాలింగ్‌ మరియు మెసేజింగ్‌ కూడా ఇందులో ఉంది. ఇక ఈ ఫోన్‌లో అదనంగా హార్డ్‌ రేట్‌ సెన్సార్‌, పెడో మీటర్‌, లైట్‌ సెన్సార్‌ ఉన్నాయి. పవర్‌ బటన్‌ మాత్రమే ఉంటుంది. ఈ బుల్లి ఫోన్‌కు వీఫోన్‌ ఎస్‌8గా పేరు పెట్టారు. త్వరలోనే ఇండియన్‌ మార్కెట్‌లోకి ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *