సగ్గుబియ్యం తో అధిక బరువు కి చెక్ పెట్టండి ఇకా………

saggu

సగ్గుబియ్యం మన ఇళ్లల్లో తరతరాల నుంచీ వాడుతున్న ఆహారపదార్థమే. అయితే దీనిని ఉపయోగించడం ద్వారా శరీరంలోని అదనపు బరువును తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునే వారు సగ్గుబియ్యం తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాలు తరువాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్ధంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు.

* పోషకాల శాతం ఎక్కువగా ఉండి, కృత్రిమ రసాయనాలు లేకపోవడం వల్ల రోగులకు సగ్గుబియ్యం తక్షణశక్తిని ఇస్తాయి.
* సగ్గు బియ్యాన్ని నీటితో ఉడికించిన తర్వాత పంచదార అందులో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి.
* మినరల్స్‌, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్‌, పీచుపదార్ధాలు ఉండటం వల్ల అన్ని వయసుల వారికి శక్తిని అందించడంలో సగ్గుబియ్యం తోడ్పడుతుంది.
* బలహీనంగా ఉన్నవారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల బలహీనత తగ్గి, తగినంత శక్తి అందుతుందని వైద్యులు చెబుతున్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *