సంసారంలో సంతోషం, సుఖం ఉంటుంది ఆడవారితో ఇలా ఉంటే…!

ఆడవారి మాటలకు అర్థాు వేరులే అని ఒక సినీ కవి అన్నాడు. అలాగే ఆడవారి మనసును అర్థం చేసుకోవడం మరియు అర్థం చేసుకున్న మనసును గెలుచుకోవడం చాలా కష్టం అని ఈతరం యువకులు అంటున్నారు. ఏ సమయంలో ఎలా వ్యవహరిస్థారో తెలియని ఆడవారితో జాగ్రత్తగా ఉండక పోతే అంతులేని చిక్కులు మరియు సమస్యలు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆడవారితో మగవారు వారికి తగ్గట్లుగా నడుచుకుంటేనే జీవితం సంతోషంగా సుఖంగా సాగుతుంది, అలా కాకుండా వ్యతిరేకంగా ఉన్నట్లయితే సుఖ సంతోషాలు ఉండవు అని పువురును చూస్తే అర్థం అవుతుంది. అలాగే పు సర్వేల్లో కూడా ఈ విషయం నిరూపితం అయ్యింది.
ముఖ్యంగా ఆడవారితో మగవారు వారికి నచ్చినట్లుగానే ఉండాలి. ప్రతి విషయంలో కూడా వారిదే పై చేయి అన్నట్లుగా వ్యవహరించాలి. అలా అని అన్ని విషయాల్లో వారినే గ్రేట్‌ అనవద్దు. అలా అన్నా కూడా వారి మనసు నొచ్చుకుంటుంది. మీరు గ్రేట్‌గా ఉంటూనే వారిని గ్రేట్‌ అనాలి. అంటే అన్ని విషయాల్లో కూడా మీరు ముందు ఉండాలి. కాని వారి కంటే కాస్త వెనుక ఉండాలి. అందరి కంటే కూడా తన భర్త అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆడవారు కోరుకుంటారు. అలా ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతి విషయంలో కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తూ, ఆమెకు రక్షణగా ఉండాలి. చిన్న విషయంలో అయినా ఆమెను రక్షించినట్లయితే ఆమె చాలా ఆనందంగా ఫీల్‌ అవుతుంది.
అమ్మాయిల మనస్సులను ఉల్లాసంగా ఉంచాలి అంటే వారు దగ్గరకు వచ్చినప్పుడు పురుషుడి వద్ద చక్కని వాసన రావాలి. అందుకోసం ఒక మంచి డియోను ఉపయోగించాలి. చెమట, దుర్వాసనను కూడా కొందరు ఎంజాయ్‌ చేస్తారు. కాని ఎక్కువ శాతం మంది చెడు వాసన కంటే మంచి వాసనను ఇష్ట పడతారు. ఇక ఆడవారు ప్రతి విషయంలో కూడా సర్‌ప్రైజ్‌ మరియు అదనం కోరుకుంటారు. సర్‌ ప్రైజ్‌ చేస్తూనే, వారికి ఇంకా ఇంకా అందిస్తూ ఉండాలి. మంచి డ్రస్‌లు వేసుకోవడం, నిజాయితీగా మాట్లాడటం, నిజమే చెప్పడం, ఇష్టమైనవి తెచ్చి పెట్టడం వంటివి చేస్తే ఆమె జీవితాంతం వదిలి పెట్టదు

Comments

comments

You may also like...