శుద్ద అబద్దం ఆ వార్త

టాలీవుడ్‌ ప్రేక్షకులు చాలా సంవత్సరాలుగా మెగా, నందమూరి కాంబినేషన్‌లో ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కాంబినేషన్‌ సాధ్యం కాదు అని భావిస్తున్న తరుణంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌లు కలిసి ఒక మల్టీస్టారర్‌ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. పలు సార్లు అందుకు సంబంధించిన కథనాలు మీడియాలో రావడంతో అంతా కూడా నిజమే అనుకున్నారు. వీరిద్దరి కోసం ప్రముఖ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు అని, త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల్లో కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే అవన్ని ఒట్టి పుకార్లే అని తాజాగా కళ్యాణ్‌ రామ్‌ తేల్చి పారేశాడు.
సాయి ధరమ్‌ తేజ్‌తో తాను ఒక సినిమా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని, ఇప్పటి వరకు తాను ఏ మల్టీస్టారర్‌ సినిమాకు సైన్‌ చేసింది లేదు అని, సాయితో మంచి సన్నిహిత్యం ఉన్నప్పటికి ఆయనతో సినిమా చేయడం లేదు అని కళ్యాణ్‌ రామ్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా కళ్యాణ్‌ రామ్‌ ‘ఇజం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఇజం’ ప్రమోషన్‌లో భాగంగానే మల్టీస్టారర్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఓకే చెప్పలేదు అని అన్నాడు. మరి భవిష్యత్తులో ఏమైనా వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందేమో చూడాలి. కళ్యాణ్‌ రామ్‌ ప్రకటన తెలుగు ప్రేక్షకులకు నిరాశ కల్గిస్తుంది.

Comments

comments

You may also like...