వ్యాయామం చేసేసాం అనుకుని ఈ ఆహార పదార్దాలు తింటే ఇక అంతే,,,,

w

మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారా ? రెగ్యులర్ గా వ్యాయామంతోనే రోజుని ప్రారంభింస్తారా ? ఒకవేళ అవును అయితే.. కొన్ని ఆహారాలను వ్యాయామం తర్వాత ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. ప్రతిరోజూ వ్యాయామం చేసే అలవాటు ఉంటే.. మన ఆరోగ్యం చాలా కాలం బాగుంటుందని మనకు తెలుసు. అలాగే వ్యాయామం రెగ్యులర్ గా చేస్తే.. అనేక రకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులు, డయాబెటిస్, ఒబేసిటీ వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.
వ్యాయామంతో పాటు.. హెల్తీ డైట్ కూడా ఫాలో అయినప్పుడే.. ఆ వ్యక్తి హెల్తీగా ఉంటాడు. వ్యాయామం అనేక రకాల వ్యాధులను, లక్షణాలను నివారిస్తుంది. అలాగే కొన్ని వ్యాధులకే వ్యాయామమే మందుగా పనిచేస్తుంది. కాబట్టి.. వ్యాయామం ద్వారా ఎక్కువ ఫలితాలు పొందాలి, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలి అంటే..వ్యాయామం చేసే వాళ్లు ఖచ్చితంగా కొన్ని డైట్ టిప్స్ ఫాలో అవ్వాలి. మరి వ్యాయామం చేసిన తర్వాత కొన్ని ఆహారాలను ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు.

v

వెజిటబుల్స్:
పచ్చికూరగాయలు ఆరోగ్యకరమే అయినా.. వ్యాయామం తర్వాత తినకూడదు. వ్యాయామం తర్వాత అనేక పోషకాలను కోల్పోయి ఉంటుంది. అలాంటప్పుడు కేవలం పచ్చికూరగాయలు మీ శరీరానికి వాటిని అందించలేవు.

swe

స్వీట్స్:
వ్యాయామం తర్వాత తినకూడని ఆహారాల్లో స్వీట్స్, పేస్ట్రీలు ఒకటి. వీటిల్లో పంచదార ఎక్కువగా ఉండటం వల్ల.. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ని అడ్డుకుంటాయి. కాబట్టి. .వ్యాయామం తర్వాత స్వీట్స్ కి దూరంగా ఉంటే.. ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

spice

స్పైసీ ఫుడ్:
స్పైసీ ఫుడ్స్ అయిన చాట్స్, ఇతర మంచూరియాలను వ్యాయామం తర్వాత తీసుకోకూడదు. వ్యాయామం శరీరం రికవర్ అవుతుంది. కానీ.. స్పైసీ ఫుడ్ తీసుకుంటే.. శరీరం రికవర్ అవడాన్ని నెమ్మదిగా మారుస్తుంది.

bar

ఫ్యాటీ ఫుడ్స్:
వ్యాయామం తర్వాత అన్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫ్రైస్, చిప్స్, సమోసా వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. వ్యాయామం తర్వాత.. కొద్ది మోతాదు కూడా.. ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకూడదు.

 

energyఎనర్జీ బార్స్:
అనేక రకాల ఎనర్జీ బార్స్ లో.. షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాయామం తర్వాత.. ఎనర్జీ ఇచ్చిన ఫీలింగ్ కలిగించినా.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి.

beans

బీన్స్:
వ్యాయామం తర్వాత.. బీన్స్ తీసుకోకూడదు. ఇవి గ్యాస్ట్రిక్ట్స్, ఇన్ డైజెషన్ వంటి సమస్యలకు కారణమవుతాయి.

 

 

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *