మొటిమలు వస్తే సంతోషించాల్సిన విషయమాట ఎందుకో తెలుసుకోండి ?!

మొటిమలు చాలా ఎక్కువగా వస్తున్నాయని చిరాకు పడే జాబితాలో ఉన్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీ చర్మ సౌందర్యాన్ని మొటిమలు కొద్దిమర దెబ్బ తీస్తున్నట్టుగా అనిపిస్తున్నా.. మీకు వృద్ధాప్యం అంత త్వరగా రాదనేందుకు అవి సంకేతమట. ఇటీవలే ఓ పరిశోధనలో మొటిమలకు, వృద్ధాప్యానికి ఉన్న ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో చూద్దాం..

మొటిమలు ఎక్కువగా వచ్చేవారి చర్మం త్వరగా ముడతలు పడదని, పలుచబడి సాగిపోదని, ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి మరీ కనిపెట్టారు. మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. ఎక్కువ కాలం జీవిస్తారనేందుకు కూడా మొటిమలను సంకేతంగా భావించవచ్చని గుర్తించారు. తెల్లరక్తకణాల్లోని టీలోమీర్ల పొడవుతో సంబంధం ఉన్న ఓ జన్యువు.. మొటిమలకు కూడా కారణం అవుతోందని కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు గుర్తించారు. ఏదైతే ఏమోగాని ముఖం నున్నగా తార్ రోడ్డులా లేదని తాత్కాలికంగా బాధపడ్డా దీర్ఘయుష్షు లభిస్తున్నందుకు మిక్కిలి సంతోషపడే విషయం వెల్లడించారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *