మెడ పై నలుపు పోయేందుకు ఇలా చేయండి…

సాధారణంగా చాలా మంది ముఖం మీద పెట్టే శ్రద్ద మెడ మీద పెట్టరు. పట్టించుకోక పోతే మెడ నల్లగా మారి అసహ్యంగా కనపడుతుంది. మెడమీద ఏర్పడ్డ నలుపు పోవాలంటే కొన్ని చిట్కాల ద్వారా ప్రయత్నం చేయవచ్చు. వంటింటిలో దొరికే వస్తువులతో సులభంగా నలుపును తగ్గించుకోవచ్చు.

* ఒక బౌల్ లో శనగపిండి, తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని మెడపై రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* బేకింగ్ సోడాలో సరిపడా నిమ్మరసం కలిపి మెడపై రాస్తే ఫలితం కనిపిస్తుంది. వారంలో మూడు సార్లు ఈ విధంగా చేయాలి.
* బియ్యం పిండి ద్రాక్ష రసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మెడకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి..

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *