మెగా హీరో భార్యను కష్టపెడుతున్నాడు ఎందుకో తెలుసా..

cha

మెగస్టార్‌ చిరంజీవి కొడుకుగా వెండితెరకు పరిచయం అయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. హీరో రామ్ చరణ్ తొలి నుంచి తన బాడీ ఫిట్ నెస్ పై శ్రద్ధ ఎక్కువ. ఆయన ఎల్లపుడూ ఫిట్ గా ఉంటారు. అది మనకు ఆయన తొలి చిత్రం చిరుతలోనే కనిపిస్తుంది. అయితే తాజాగా ఆయన మరింతగా జిమ్ కు వెళ్లటం మొదలెట్టారు.
ఎందుకంటే ఆయన ప్రస్తుతం ధృవ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. అందుకోసం ఆయన తన బాడీని మరింత ఫిట్ గా ఉంచుకుంటున్నారు. ఆయన ఒక్కరే

జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తున్నారా అంటే… లేదు తనతో పాటు తన భార్యను కూడా తీసుకు వెళ్తున్నారు. రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన కలిసి జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. రామచరణ్ అయితే తన సినిమాకోసం జిమ్ చేస్తున్నారు. తనతో పాటు నాకు కూడా చెమటలు పట్టిస్తున్నారు అని ఉపాసన వెల్లడించింది. తన భర్త చరణ్‌తో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఒక వీడియోను ఉపాసన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

Comments

comments

You may also like...