మూవీ ఆల్‌ టైం రికార్డ్‌ మహేష్‌, మురుగదాస్‌ల కొమినేసన్

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సినిమా సినిమాకు క్రేజ్‌ పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు. ‘శ్రీమంతుడు’ సినిమాతో మహేష్‌ బాబు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా మహేష్‌బాబు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మహేష్‌బాబు ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నాడు. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత భారీ బడ్జెట్‌ సినిమాకు అదే స్థాయిలో భారీగా బిజినెస్‌ జరుగుతుంది.
150 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కావడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. అనుకున్నట్లుగా ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ మరియు హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను జీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 30 కోట్లకు జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 20 కోట్లు శాటిలైట్‌ రైట్స్‌ కాగా, 10 కోట్లు హిందీ డబ్బింగ్స్‌ రైట్స్‌గా చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం టాలీవుడ్‌లో ఆల్‌ టైం రికార్డు అని చెప్పుకోవచ్చు. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాకుండానే ఈ స్థాయిలో బిజినెస్‌ చేస్తున్న ఈ సినిమా ముందు ముందు మరెంతగా ఈ సినిమా రికార్డులను సాధిస్తుందో అని టాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబుకు జోడీగా ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *