మీరు ఖచ్చితంగా రోజూ గుడ్డు తింటారు ఇది చదివితే .,,,

గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్ల వాడకాన్నీ, దానిలోని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు తెలియజెప్పుతూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారం నాడు ‘వరల్డ్‌ ఎగ్‌ డే’ నిర్వహించడం జరుగుతుంది. మన దేశంలో గుడ్డు వాడకం అధికమనే చె ప్పాలి.‚‚‚‚ గుడ్డును పలు రూపాలలో ఆహారంగా తీసుకుంటారు. పచ్చి గుడ్డుసొనను నోటిలో పోసుకొని మింగడం, గుడ్డును ఉడికించి తిన డం, ఉడికించిన గుడ్డు బ్రెడ్‌ ని కలిపి టోస్ట్‌గా కూడా తీసుకుంటారు. అంతేకాకుండా గుడ్డు ను పలావులో, బిర్యానిలో రుచికోసం వాడతా రు, బేకరీలలో కేకుల తయారీల్లో గుడ్డును విరివిగా వాడుతారు. గుడ్డు ఆమ్లెట్‌, బుల్స్‌ ఐ,ఎగ్‌ ఫ్రై… కూరగా వాడుతారు. గుడ్డు ఏ ఒక్క వయసువారికో పరిమితమైన ఆహారం కాదు. బాల్యం నుండి వృద్దాప్యం వరకు అన్ని వయసులలో స్ర్తీ పురుషులు భేదం లేకుండా గుడ్డును తీసుకుంటారు.
గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్తూనే వున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కిచెబుతున్నారు. ఉదయం అల్పాహారంతో గుడ్డు తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనము లో తేలింది. గుడ్డులో సొన శక్తినిస్తుంది. శరీరంలో ప్రతి అవయవం మీద గుడ్డు ప్రభావం చూపుతుంది. గుడ్డును శాకాహారంగా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. గుడ్డు ద్వారా మనకందే పోషకాలు: క్యాలరీలు: 70-80, ప్రోటీన్లు : 6 గ్రాములు, క్రొవ్వులు: 5 గ్రాములు, కొలెస్టిరాల్‌: 190 గ్రాములు, నీరు: 87% , గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. ఇవన్నీ ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడుతాయో తెలుసుకుందాం…

boiled-egg

న్యూట్రీషియన్ :
గుడ్డులో న్యూట్రీషియన్స్ అత్యధికంగా ఉంటాయి. ఒక ఉడికించిన గుడ్డులో ప్రోటీన్స్, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, డి, ఇ, కె, కాల్షియం, జింక్, ఫొల్లెట్, సెలీనియం, ఫాస్పరస్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒక గుడ్డు తినడంవలో అందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మరిన్ని న్యూట్రీషియన్స్ పొందవచ్చు.

body

బాడీని స్ట్రాంగ్ గా మార్చుతుంది:
శరీరం లోపల నుండి బలాన్ని అందిస్తుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు ఫంక్షనల్ ఎంటిటిని అందిస్తుంది. బాడీ బిల్డింగ్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. అలాగే అమినో యాసిడ్స్ ను అదే మోతాదులో అందిస్తుంది.

hand-egg

యాంటీ ఆక్సిడెంట్స్ అధికం:
వయస్సైయ్యే కొద్ది చాలా మంది బలహీనపడుతుంటారు, అయితే గుడ్డులో ఉండే రెండు పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, జియాక్సిథిన్, లూటిన్స్ కళ్ళ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మాస్కులర్ డీజనరేషన్ కాంటరాక్ట్ తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఎ బ్లైడ్ నెస్ ను నివారిస్తుంది. రెగ్యులర్ గా గుడ్డు తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

hair-colornail

బోన్స్, హెయిర్స్, నెయిల్ ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది:
గుడ్డులో ఉండే విటమిన్ డి బోన్ డెవలప్ మెంట్, జుట్టు , నెయిల్ పెరుగుదలకు విటమిన్ డి గ్రేట్ గా సమాయపడుతుంది. ఇంకా గుడ్డులో ఉండే అనేక రకాల విటమిన్స్, మినిరల్స్, బయో కెమికల్స్ హెల్తీ హెయిర్ అండ్ నెయిల్స్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది.

brain

గుడ్డు కోలిన్ అందిస్తుంది:
కోలిన్ చాలా ముఖ్యమైన న్యూట్రీషియన్, ఇది విటమిన్ బిగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కణాలు ఏర్పాటుకు సహాయపడుతుంది. బ్రెయిన్ కు సిగ్నెల్స్ చేరవేయడానికి సహాయపడే మోలిక్యూల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి హెల్తీ అండ్ హెల్ప్ ఫుల్ న్యూట్రీషియన్స్ గురించి చాలా మందికి తెలియదు. ఒక గుడ్డు 100గ్రాముల కోలిన్ ను అందిస్తుంది. మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుంది.

cho

గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ మీద ప్రభావం చూపదు:
చాలా మంది గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుదుందని అపోహపడుతుంటారు. ఒక గుడ్డులో 212mg ల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది కేవలం రోజూ తీసుకునే డోస్ 300mgల కంటే 88 కంటే తక్కువగా ఉంటుంది. గుడ్డులో ఉండే ఈ కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ పెరగనివ్వదు.

cholas

హెడిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది:
ఎవరిలో అయితే ఎక్కువ హెడిల్ లేదా హైడెన్సిటి లిప్పో ప్రోటీన్ ఉంటుందో వారిలో హార్ట్ డిసీజ్ మరియు ఇతర ఆరోగ్యా సమస్యలకు గురిచేయదు. గుడ్డును ఆహారంగా తీసుకోవటానికి, కొలెస్టరాల్‌కి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు. పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టరాల్‌ పెరుగుతుందని తేలింది.

cho

ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించి హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది:
గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనం వల్ల వెల్లడయ్యింది. వాస్తవంగా గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపో వటం లేదా గుడెజబ్బులు రావటం బాగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

weight-loss

బరువు తగ్గిస్తుంది:
బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు… అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు.

app

గుడ్డులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది:
ఓమేగా 3 రిచ్ ఫుడ్స్ లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది.. ఇది బ్లడ్ లెవల్లో ట్రై గ్లిజరైడ్స్ ను ను తగ్గిస్తుంది. కాబట్టి, ఓమేగా 3 అధికంగా ఉండే గుడ్డును మూడు వారాలు తినడం వల్ల ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది. హెల్తీగా ఉంచుతుంది: గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనం వల్ల వెల్లడయ్యింది. వాస్తవంగా గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపో వటం లేదా గుండె జబ్బులు రావటం బాగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *