మీరు ఖచ్చితంగా కొత్తగా బండి కొనాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోవలసిందే

bi bii

బైక్ పై రైడ్ చేయాలనే సరదా ఎవరికి ఉండదు చెప్పండి..? కాలేజీలోకి అడుగుపెడుతూనే రయ్ మంటూ బైక్ పై దూసుకుపోయే కుర్రకారు… రోజూ కార్యాలయానికి తనకు నచ్చిన బైక్ పై వెళ్లాలనుకునే సగటు ఉద్యోగి… ఉద్యోగం చేస్తున్న మహిళ అయినా… ఇంటి పట్టున ఉండే గృహిణి అయినా స్కూటర్ పై సవారీ చేయాలన్న సరదా వుంటుంది… ఇలా చూస్తే మోటారు సైకిల్ పై మక్కువ అన్ని వర్గాల వారిలోనూ కనిపిస్తుంది. అయితే, బైక్ కొనే ముందు అందులో మీకు కావాల్సినవి ఉన్నాయా..? అసలు మీకు ఆ బైక్ సరిపడుతుందా..? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
మధ్య తరగతి ప్రజలకు ఒకప్పుడు బైక్ అనేది కల అయితే, నేడు కారు డ్రీమ్ గా మారిపోయింది. అయినాగానీ పట్టణాల్లో కార్లున్న వారికి బైక్ లు కూడా తప్పకుండా ఉంటున్నాయి. ఎందుకంటే చిన్న రోడ్లలోనూ బైకులపై దూసుకుపోవచ్చు. పార్కింగ్ సమస్య ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు కారు, దగ్గర దగ్గర ప్రాంతాలకు వెళ్లేందుకు బైక్ వాడడం అనేది ఎక్కువ మంది చేస్తున్న పని. ఈ విధంగా చూసుకున్నా బైకుల డిమాండ్ మన దేశంలో చాలా ఎక్కువ. అయితే, పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే రకం బైకులు, పెద్దలు, యువకులకు, స్త్రీలకు ఒకే రకమైన బైకులు సరిపడవు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బైక్ సరిపోలుతుంది. అందుకే ఈ విషయాలను తెలుసుకోవడం అవసరం.

Comments

comments

You may also like...