మరో బహిరంగ సభ: జనసేన

paww

పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నాడు. సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికి కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రజల ఇబ్బందులు, వారు పడుతున్న కష్టాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. తాజాగా కూడా గోదావరి జిల్లాలో నిర్మించతల పెట్టిన మెగా అక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడాడు. ఇక తాజాగా పవన్‌ కళ్యాణ్‌ పార్టీ విస్తరణ మరియు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విషయమై దృష్టి పెట్టాడు.
ఇప్పటి వరకు ప్రత్యేక హోదా కోసం రెండు బహిరంగ సభలను పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించడం జరిగింది. ఇక త్వరలోనే మూడవ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకోసం తన సన్నిహితులకు సందేశం కూడా పంపించాడు. మూడవ సభను కరువు జిల్లా అనంతపురంను ఎంచుకోవడం జరిగింది. ఇప్పటికే అనంతపురంలో అందుకు అనువైన స్థలం కోసం నాయకులు అన్వేషిస్తున్నారు.

నవంబర్‌ 10న భారీ ఎత్తున జనసేన మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. గత బహిరంగ సభలో ఒక అభిమాని చనిపోవడంతో పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ బహిరంగ సభలు పెట్టను అన్నాడు. కాని పవన్‌ రాజకీయాల్లో నెగ్గుకు రావాలి అంటే బహిరంగ సభలు తప్పని సరి అని తెలుసుకున్నాడు. అందుకే అనంతపురంలో బహిరంగకు రంగం సిద్దం చేస్తున్నాడు. ఆ సభలో పవన్‌ ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Comments

comments

You may also like...