‘బాహుబలి’ = 100 సినిమాలు

bahubali

‘మిర్చి’ చిత్రం తర్వాత ‘బాహుబలి’ సినిమా మినహా మరే సినిమాను ప్రభాస్‌ చేసింది లేదు. ‘మిర్చి’ సినిమా వచ్చి నాలుగు సంవత్సరాలు దాటి పోయింది. వచ్చే సంవత్సరంలో ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ విడుదల అవుతుంది. అప్పటి వరకు కూడా ప్రభాస్‌ మరో సినిమాను చేసేది లేదు. అంటే ఒక్క బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ ఏకంగా దాదాపుగా అయిదు సంవత్సరాలు కేటాయించాడు. ఈ సమయంలో ప్రభాస్‌ ఖచ్చితంగా పది సినిమాలకు పైగా చేసేవాడు. అదే విషయాన్ని తాజాగా ముంబయి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మీడియా ప్రతినిధులు ప్రభాస్‌ను అడిగారు. అందుకు ప్రభాస్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
తనకు అలాంటి ఆలోచనే ఇప్పటి వరకు రాలేదు అని, ‘బాహుబలి’ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఒక్క బాహుబలి సినిమా 100 సినిమాలతో సమానం అని, అలాంటప్పుడు సినిమాలు మిస్‌ అయ్యాను అనే ఆలోచనే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ వంటి సినిమాల్లో నటించే అవకాశం అందరికి రాదు అని, ఆ అవకాశం కొందరికే దక్కుతుందని, అది నాకు దక్కడం సంతోషంగా ఉందని ప్రభాస్‌ మీడియాతో చెప్పుకొచ్చాడు. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ తన తర్వాత సినిమాను చేయబోతున్నాడు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *