ప్రాణాంతక డెంగ్యూకు మందు దొరికేసింది !

ఇప్పుడు అందరినీ వణికిస్తున్న ఫీవర్ డెంగ్యూ.. దోమల కారణంగా వ్యాపించే ఈ ప్రాణాంతక జ్వరంతో ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అందుకే దీనిపై సీరియస్ పరిశోధనలు అవసరమయ్యాయి. అయితే, ప్రపంచంలోనే తొలిసారిగా డెంగ్యూ వ్యాధి కోసం రూపొందించిన వ్యాక్సిన్‌కు 14 దేశాలు ఆమోదం చెప్పేశాయి. సనోఫి సంస్థకు చెందిన వ్యాక్సిన్ విభాగం సనోఫి పాశ్చర్ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. డెంగ్వాక్సియా అని పిలిచే ఈ వ్యాక్సిన్‌కుఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్‌ అప్రూవ్ ఇచ్చాయి. ఈ దేశాలతోపాటు మెక్సికో, ఫిలిప్ఫైన్స్, బ్రెజిల్, ఎల్ సాల్వెడార్, కోస్టారికా, పరాగ్వే, గ్వాటిమలా, పెరు కూడా డెంగ్వాక్సియాకు పచ్చ జెండా ఊపాయి.

2020 నాటికి డెంగ్యూ ద్వారా సంభవించే మరణాలను 50 శాతం, వ్యాధి ప్రబలడాన్ని 25 శాతం మేర అరికట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తమ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని సనోఫి పాశ్చర్ గ్లోబల్ మెడికల్ అఫైర్స్ హెడ్ సు పియింగ్ న్జి చెప్పారు. ఇండోనేసియా, బ్రెజిల్, మెక్సికో దేశాలు డెంగ్వాక్సియాను సిఫార్సు చేశాయని సంస్థ తెలిపింది. తొమ్మిదేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో డెంగ్యూ రాకుండా చూడటంలో మూడింట రెండొంతుల మేర ఈ వ్యాక్సిన్ విజయవంతమైందని క్లినికల్ స్టడీల్లో వెల్లడైంది. డెంగ్యూ కారణంగా హాస్పిటల్లో చేరుతున్న కేసులు కూడా ఈ వ్యాక్సిన్ కారణంగా తగ్గుముఖం పట్టాయి. ఈ వ్యాక్సిన్‌ను డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉన్న లాటిన్ అమెరికా, ఆసియా ఖండాలకు చెందిన పది దేశాల్లో పరీక్షించారు. మొత్తానికి ఈ వ్యాక్సిన్ విజయవంతమైందని తయారీదారులు వెల్లడించారు

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *