ప్రముఖ దర్శకుడు అనుష్క అందుకు పనికిరాదన్నాడు

a-sar

 

బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మామి చలనచిత్రోత్సవంలో పాల్గొన్న కరణ్.. అనుష్క కెరీర్‌ను సర్వనాశనం చేయాలని అనుకున్నట్టు పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత మంచి టాలెంట్ ఉన్న ఆమె కెరీర్‌ను నాశనం చేయాలని భావించి తప్పు చేశానని అనుకున్నానని, వెంటనే ఆమెను కలిసి క్షమాపణలు కూడా చెప్పానని వివరించాడు.
యశ్‌రాజ్ ఫిలింస్ ఉపాధ్యక్షుడు ఆదిత్య చోప్రా ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క శర్మను తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని కరణ్‌ వద్ద ప్రస్తావించాడు. ‘ఆమెనెందుకు తీసుకుంటావ్? నీకేమన్నా పిచ్చా? కావాలంటే మరో హీరోయిన్‌ను తీసుకో’ అని కరణ్.. ఆదిత్యకు సూచించాడు.

అయితే కరణ్ మాటను లెక్కచేయని ఆదిత్య.. అనుష్కనే తీసుకున్నాడు. దీంతో సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు కరణ్.. అనుష్కను తిట్టుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత ‘రబ్‌నే బనాదీ జోడీ’ సినిమా సమయంలోనూ అనుష్కపై అదే కోపం, కసి పెంచుకున్నాడు. కానీ ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా విడుదలయ్యాక అనుష్క లాంటి మంచి టాలెంట్ ఉన్న నటిని వదులుకోవాలని, ఆమె కెరీర్‌ను నాశనం చేయాలని భావించి తప్పు చేశానని రియలైజ్ అయ్యాడు. వెంటనే అనుష్కను కలిసి క్షమాపణ వేడుకున్నాడు. ఈ మొత్తం విషయాన్ని కరణ్ జోహార్ స్వయంగా వివరించాడు.

Comments

comments

You may also like...