పుట్టే మగపిల్లల్లో కృత్రిమ గర్భధారణ వల్ల లోపం ఉంటుందుంట..!

de

పిల్లలు కలగని చాలామంది తల్లిదండ్రులకు ఒక వరం కృత్రిమ గర్భధారణ. పురుషుల వీర్యంలో శుక్రకణాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఐసిఎస్ఐ అనే గర్భధారణ ప్రక్రియ ద్వారా మహిళలకు గర్భధారణ జరిగేలా చూడవచ్చు. ఇంట్రా సైటోప్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ఐసిఎస్ఐ ) అనే ప్రక్రియ ద్వారా ఫెర్టిలిటీ నిపుణులు మహిళలకు గర్భధారణ కలిగేలా చూస్తారు. అయితే ఇలా పుట్టే మగ సంతానానికి భవిష్యత్తులో వాళ్ళ నాన్న లాగే వీర్యకణాల్లో కౌంట్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు పేర్కొంటున్నారు.

బెల్జియంలోని బ్రజేల్ యూనివర్సిటీకి చెందినా సెంటర్ ఫర్ రీ ప్రొడక్టివ్ మేడిసన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పరిసోధనల్లో ఈ విషయం తెలిసింది. అప్పట్లో 1992 నుంచి 1996 వరకు పుట్టిన పిల్లు ఇప్పుడు యుక్త వయస్కులయ్యారు.అప్పుడు మామూలుగా పుట్టిన పిల్లలకు, కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన పిల్లలకు మధ్య తేడాలను నిశితంగా పరిశీలించిన నిపుణులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు.   పరమైన లోపాలు ఆ పిల్లల జన్యువుల్లోకి రావడం వల్ల వారిలో ఈ పరిస్థితి కలిగే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధన బ్రందం తెలిపింది. ఇది ఊహించని ఫలితం అని వారంటున్నారు.

Comments

comments

You may also like...