నేడు వయోవృద్ధుల దినోత్సవం

పిల్లల చిటికెన వేలు పట్టుకుని నడకను నే ర్పి వారిని కంటికి రెప్పలా కాపాడు కుంటారు తల్లిదండ్రులు. కష్టాలకోర్చి వారికి చదువు సంధ్యలునేర్పించి పిల్లల భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు శక్తినంతా ధా రపోస్తారు. అలా అలసివార్థక్యంలో జవసత్వాలుడిగిన వారిని పిల్లల మాదిరిగా చూ సుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఎం తైనా ఉంది. నేడు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భం

ఇదీ చట్టం :
సంతానం నిరాదరణకు గురవుతున్న ముదిమి వయస్సు తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం 2007 లో తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్ష ణ, సంక్షేమ (ది మెయింటెనెన్స్‌ అం డ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌) చట్టాన్ని రూ పొందించింది. జమ్మూ కశ్మీర్‌ మిన హా దేశమంతా ఈ చట్టం అమల్లో ఉంది. బాధిత తల్లిదండ్రులకు ఈ చట్టం ఆసరాగా ఉంటుంది. అన్ని వి ధాల న్యాయం జరిగేలా వివిధ సెక్ష న్ల కింద దీన్ని విపులంగా వివరించా రు. ఏపీ సీనియర్‌ సిటిజ న్‌ చట్టం 2011లో రాష్ట్ర ప్రభుత్వం వృ ద్ధుల సంక్షేమం కోసం ఈ చట్టాన్ని అమ ల్లోకి తీసుకువచ్చింది. ఎవరైతే వృద్ధు లు వారికి వారు పోషించుకోలేని స్థితిలో ఉండటంతో పాటు వారి ఆస్తిపాస్తుల ద్వారా ఎలాంటి సంపాదనా లేని వారు ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిర్యాదు చేసే విధానం ఇది…?

బాధితులు తమకు తాముగా ఫిర్యాదు చేయవచ్చు. చేతకాని పరిస్థితుల్లో ఇతర వ్యక్తులు, స్వచ్ఛంద సం స్థల సాయంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించవచ్చు. సంతానం ద్వారా వారి కి జరుగుతున్న అన్యాయాన్ని నేరు గా ట్రిబ్యునల్‌ (ఆర్డీవో స్థాయి అధికా రి)కు తీసుకువెళితే ఆ కేసును వారు సుమోటోగా స్వీకరిస్తారు. ఎవరైనా ఒక వృద్ధుడిని సాకకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యానికి గురి చేస్తే సెక్షన్‌ 25 ప్రకారం అతనికి మూడు మాసా లు చెరసాల లేకుంటే రూ. ఐదు వేల జరిమానా లేదా రెండు శిక్షలు విధిం చే అవకాశం ఉంది.
 

మానవ సంబంధాలే కీలకం
సీనియర్‌ సిటిజన్స్‌

‘దేనికైనా మానవ సంబంధాలే కీ లకం. ప్రపంచంలో మన దేశాన్ని ప్రత్యేకంగా చూపడానికి కారణం మన ఉమ్మడి వ్యవస్థే. అయితే నేడు అది కాస్తా కనుమరువుగవుతోంది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. దీని ఫలితంగానే అనేక మంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు.

old-parents

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *