నిద్రపోయేముందు ఈ డ్రింక్ త్రాగండి పొట్ట తగ్గాలంటే ఎనర్జీ కూడా…

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్. చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్, డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని ఫాలో అయినా ఫలితం కనిపించనప్పుడు.. మధ్యలోనే వదిలేయడం కామన్ గా జరిగిపోతోంది. కానీ మెటబాలిజం ప్రక్రియ ఎలా జరుగుతుందని.. దాన్ని ఎలా సక్రమంగా సాగేలా జాగ్రత్తపడతారో.. వాళ్లకు బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది.
మెటబాలిక్ రేటు వయసు, జెండర్, మజిల్ మాస్ ని బట్టి వర్క్ అవుతుంది. మహిళల్లో కంటే.. మగవాళ్లలలో మెటబాలిజం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. మగవాళ్లలో కండరాల సౌష్టవం బలంగా ఉంటుంది కాబట్టి. అయితే మెటబాలిజం రేటుని పెంచితే.. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అయితే మెటబాలిజం స్థాయిని పెంచడానికి ఈ సింపుల్ డ్రింక్ ప్రయత్నించండి.

ఇది మీ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు దీన్ని తీసుకోవాలి. 2 గ్రేప్ ఫ్రూట్స్ , 1 టేబుల్ స్పూన్ అల్లం రసం, అర టీ స్పూన్ దాల్చిన చెక్క, అరగ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి బాగా మిక్స్ చేయాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్ తాగాలి. ఇలా 12 రోజులు తాగిన తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 12 రోజులు కంటిన్యూగా తాగాలి. ఇలా ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ అందడంతో పాటు, బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.

Comments

comments

You may also like...