నార్మల్ డెలివరీ అయ్యే అద్బుతమైన టెక్నిక్ ఆపరేషన్ లేకుండా,…

A doctor holding a beautiful baby boy minutes after the birth.

nu

 

ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు, ఇది ఈతరం సామెత…కానీ మునుపటి రోజుల్లో ఈ కుటుంబ నియంత్రణ అంతగా లేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత బలం అన్నట్టు ఉండేది. ఈ క్రమంలోనే ఒక్కో మహిళ 5 – 10 మంది పిల్లలకు జన్మనిచ్చేవారు. పైగా అవన్నీ నార్మల్ డెలివరీలే, అసలు ఆపరేషన్ అనే పదమే అప్పుడు పుట్టలేదు. ఇప్పుడైతేనే ఫస్ట్ కాన్పే సీజేరియన్.! అసలెందుకీ తేడా..? అప్పటి మహిళలకు ఇప్పుడు మహిళలకున్న తేడా ఏంటి? కాస్త వివరంగా తెల్సుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు చపాతీలు చేయాలనుకుంటే…పిండిని గుండ్రంగా చేసి పెనం మీద వేస్తే సరిపోతుంది, అదేవిధంగా పప్పు వండాలంటే…ఆల్ రెడీ కొన్న పప్పుని నానబెట్టి, కుక్కర్లో వేసి గ్యాస్ మీదికెక్కిస్తే సరిపోతుంది. కానీ పూర్వం….పప్పు కావాలన్నా, పిండి కావాలన్న…విసురాళ్లే ( తిరగలి) దిక్కు…కాబట్టి రోజుకో సారి ఇసుర్రాయి తో పనిపడేది అప్పటి మహిళలకు…..తమ కుటుంబానికి ఆత్మీయమైన వంటను చేస్తూనే , తమ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునే వారు అప్పటి మహిళలు.
ఇసుర్రాయి వాడితే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువ..::
* ఇసుర్రాయి తిప్పేటప్పుడు మహిళల పొత్తికడుపై పై ఒత్తిడి పడుతుంది. ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. గుండ్రాంగా తిరగటం వల్ల పక్కటెముకలు ఫ్రీ అవుతాయి. నడుముపై బాగానికి బాగా ఎక్సైర్ సైజ్ జరగటం వల్ల కటి ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. ఇది ప్రసవసమయంలో నార్మల్ డెలివరీ అయ్యేందుకు దోహదపడుతుంది. ఇలా పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు.

rolu

* గర్భిణిలు 6-7 నెలల వరకు ఇసుర్రాయిని తిప్పొచ్చు.
* ఇసుర్రాయిని తిప్పటం వల్ల అధిక బరువు తగ్గుతుంది.
* ఇసుర్రాయిని ప్రతి రోజు ఉపయోగించే మహిళల్లో మోనోపాజ్ సమస్యలు రావు.
* మోకాలినొప్పులు, భుజం నొప్పులు, నడుం నొప్పులురావు.
* బిపి, షుగర్ కంట్రంల్ లో ఉంటాయి.
* పూర్వం ఆపరేషన్ అనేదే లేకుండా..ఒక్కొక్క తల్లి 5-10 మంది పిల్లలకు ఎలా జన్మనివ్వడానికి ఇదే ప్రధాన కారణం.

హెల్తీ డైట్: మీరు గర్భం ధరించారని నిర్దారించగానే, మొదట మీరు చేయవల్సిన ముఖ్యమైన పని, హెల్తీ డైట్ ను పాటించడమే. అందులో ముఖ్యంగా జింక్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం.
అరగంట నడక: నార్మల్ డెలివరీ కోరుకొనే వారు హెల్తీ డైట్ తో పాటు మరో ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ప్రశాంతమైన నడక. ప్రతి రోజూ అరగంట నడవడం వల్ల, సిజేరియన్ కు అవకాశం ఉండదు. లేదంటే మీ డ్యూడేట్ కంటే ముందే సిజేరియన్ కు సిద్దపడాల్సి ఉంటుంది.
ఎక్కువ సమయం నిలబడాన్ని నివారించండి : గర్బిణీలు ఎక్కువ సమయం నిలబడటం వల్ల కడుపులో ఉన్న శిశువు గురుత్వాకర్షణకు గురి అవుతారని, దాంతో పెల్విస్ వద్దకు చేరుకుంటారని కొందరు నిపుణులు చెప్పడం జరిగింది. ప్రెగ్నెన్సీ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఎక్కువ సమయం నిలబడకపోవడం మంచిది. నార్మల్ డెలివరీ కోరుకొనే వారు గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ఇది.
యోగా చేసే మ్యాజిక్: యోగా సెషన్ లో మీ పేరు నమోదు చేసుకోవడానికి మాత్రమే పరిమితం అయితే, సీ సెసన్ కు మీరు సిద్దం అవుతున్నట్లే. కాబట్టి, యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల రెస్పిరేషన్ రెగ్యులేట్ చేయడానికి, హార్ట్ బీట్ మరియు మీ శరీరం విశ్రాంతి పొందడానికి బాగా సహాయడపడుతుంది. యోగానిపుణుల సమక్షంలో, రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల శరీరం మరింత ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది మరియు ఇది నార్మల్ డెలివరీకి సహాయపడుతుంది.
ప్రీనేటల్ క్లాస్: గర్భిణీ స్త్రీలు ప్రీనేటల్ క్లాసులకు హాజరవ్వడం వల్ల, డెలివరీ సమయానికి మీకు అవసరం అయ్యే ప్రెగ్నెన్సీ చిట్కాలన్నింటిని తెలుసుకోవచ్చు. ప్రీనేటల్ క్లాస్ లో కొన్ని ప్రెగ్నెన్సీ వ్యాయామాలు నేర్చుకోవడం వల్ల బేబీ పుట్టే సమయంలో నొప్పులను నివారించవచ్చు.

శరీరాన్ని హైడ్రేట్ లో ఉంచుకోవాలి: ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీ చిట్కా, ముఖ్యంగా నార్మల్ డెలివరీకి నీటి అవసరం ఎక్కువగా ఉంది. గర్భధారణ సమయంలో గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధక సమస్యను నివారించుకోడం కోసం అధికంగా నీరు, ద్రవాలు, తాజా జ్యూసులు తీసుకోవడం చాలా అవసరం.
ఒత్తిడి లేకుండా: గర్భాధారణ సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుడదని మీఅంతట మీరు ప్రామిస్ చేసుకోవాలి. ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే అంత ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎల్లప్పుడు సంతోషంగా గడపడానికి తప్పక ప్రయత్నించాలి. మీ ప్రవర్తనే మిమ్మల్ని మరియు కడుపులో పెరిగే బిడ్డకు ఆరోగ్యకరం.
ఫ్యాషనబుల్: నార్మల్ డెలివరీకి మరో బెస్ట్ ప్రెగ్నెన్సీ టిప్…మీకు ఆశ్చర్యం కలగవచ్చు!ఎందుకు?ఎలా? అని. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పనిచేసే ఉద్యోగిణులు గాజులు వేసుకోవడం వల్ల గాజుల నుండి వచ్చే గళగళ శబ్ధాలు కడుపులోని శిశువుకు ధ్వని ప్రకంపనలు అందిస్తుందని చెబుతుంటారు. ఈ గణగణ మోగ్రే శబ్దాలు ప్రెగ్నెంట్ స్త్రీలకు ప్రశాంతతకు మరియు పెల్విక్ (కటి కండరాలు)మరయిు స్నాయువులు సడలింపుకు సార్మల్ డెలివరీ సులభతం చేస్తుంది.

Comments

comments

You may also like...