నల్లటి మచ్చలు వేధిస్తున్నాయా ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజ పద్ధతులతో ముఖంపై ఈవిధంగా చేయండి…

black

ముఖంపై నల్లటి మచ్చలు తగ్గడం లేదా.. బయటకు వెళ్లడానికి జంకుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి.. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజ పద్ధతులతో ముఖాన్ని అందంగా తయారుచేసుకోండి.
సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్‌గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్‌ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలను పాటిస్తే మచ్చలు పోవడమే కాదు.. చర్మం కొత్త మెరుపును సంతరించు కుంటుంది.
అర స్పూన్‌ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్‌ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ వదిలిపోతుంది.
చిటికెడు పసుపును రెండు మూడు గోరింటాకులతో కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.
కొంచెం పసుపు, కరివేపాకును కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై రాయాలి.
ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా కలుపుకోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.

రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్లలో చపాతీని నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని పేస్ట్‌లాగా చేసి ముఖానికి పట్టించండి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి.
కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తొందరగా మాయమవుతాయి.
మచ్చలను తొలగించడంలో సిట్రస్‌ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్‌ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్‌-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.
కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.
మచ్చలున్న ప్రదేశంలో తేనెను రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనెలో ఎన్నో చక్కటి ఔషధ గుణాలున్నాయి. అవి నల్లమచ్చలను తొలగించడంలో తోడ్పడతాయి.
విటమిన్‌-ఇ ఆయిల్‌ను రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసుకుని తెల్లారి లేచిన తర్వాత కడుక్కోండి.
వీటితోపాటు నిత్యం సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ముఖానికి రాసుకోవడం మర్చిపోవద్దు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *