దారులు మూసుకు పోలేదు ట్రంప్‌

trum

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెలలో ఉన్న విషయం తెల్సిందే. పలు సర్వేలు హిల్లరీ క్లింటన్‌ దేశ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా ట్రంప్‌కు దారులు మూసుకు పోయినట్లే అని చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ట్రంప్‌ గెలవడం కష్టమే అంటూ జోష్యం చెబుతున్నారు. ట్రంప్‌ సొంత పార్టీ నేతల్లో కూడా ఆయనపై వ్యతిరేకత ఉంది. ఈ పరిణామాలతో ట్రంప్‌ గెలుపు అసాధ్యం అనుకుంటున్న సమయంలో ట్రంప్‌కు ఇంకా అవకాశాలు పూర్తిగా మూసుకు పోలేదు అని, ఆయనకు అధ్యక్షుడు అయ్యే దారులు ఉన్నాయి అంటూ రాయిటర్స్‌ వార్త సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో వెళ్లడైంది.
ప్రస్తుతం ఇద్దరి మద్య కూడా వ్యత్యాసం కొంత తేడా మాత్రమే ఉందని, అయితే ఎన్నికలకు గడువు ఉన్న నేపథ్యంలో ట్రంప్‌ ఆ తేడాను చెరిపేసి ముందుకు జరిగే అవకాశాలు లేక పోలేదు అని సదరు సర్వేలో తేలింది. ట్రంప్‌ ఈ సమయంలో మరింత ప్రభావితంగా ప్రచారం చేస్తే తప్పకుండా అధ్యక్ష పీఠంపై ఎక్కే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇటీవల ట్రంప్‌ చేసిన రిగ్గింగ్‌ వ్యాఖ్యలు మంచి ప్రభావాన్ని చూపినట్లుగా తెలుస్తోంది. హిల్లరీపై విమర్శలకు కాస్తంత పదును పెట్టినట్లయితే ట్రంప్‌ గెలవడం దాదాపు ఖాయం అని వారు అంటున్నారు. ట్రంప్‌ అధ్యక్ష పీఠం ఎక్కుతాడా అనేది మరో నెల రోజుల్లో తేలిపోనుంది.

Comments

comments

You may also like...