49 పరుగులు తొమ్మిదో వికెట్ కు ఉత్కంట పోరులో ఓడిన భారత్

భారత న్యూజీలాండ్ జట్ల మధ్య డిల్లీ లో జరిగిన రెండో వన్డేలో భారత్ చివరి వరకూ పోరాడి 6 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ పరుగులేమీ లేకుండానే గుప్టిల్ వికెట్ ను సొంతం చేసుకుంది. ఉమేష్ యాదవ్ బౌలర్. ఆ తరువాత కెప్టెన్ విలియంసన్ వీర విహారం చేసి సెంచరీ సాదించాడు. లాదం తో కలిసి రెండో వికెట్ కు 120 పరుగులు జోడించాడు. లాడం 46 బంతుల్లో 46 పరుగులు చేసాడు. ఇందులో 6 ఫోర్లు 1 సిక్సు ఉన్నాయి. విలియం సన్ 128 బంతుల్లో 14 ఫోర్లు 1 సిక్సుతో 118 పరుగులు చేసాడు. భారత బౌలర్లు చివరి 10 ఓవర్లలో బాగా కట్టడి చేసి 6 వికెట్లు పడగొట్టారు. బుమ్రా,మిశ్రా  3 వికెట్లు పడగొట్టారు. న్యూజీలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో  242 పరుగులు చేసింది. 243 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత జట్టు లో ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు.

రోహిత్ శర్మ 15 పరుగులు చేయగా, కోహ్లి 9 పరుగులు చేసి నిరాస పరిచాడు. ఆ తరువాత వెంట వెంటనే రహానే, మనీష్ పాండే ఔటవడంతో 73 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత  జాదవ్, కెప్టెన్ ధోనిలు కలిసి 5 వ వికెట్ కు 66 పరుగులు జోడించారు. కేదార్ జాదవ్ ధాటిగా ఆడి 37 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సులతో 41 పరుగులు చేసాడు. ఆ తరువాత ధోని అక్సర్ పటేల్ లు కొంచెసేపు పోరాడినప్పటికీ వెంట వెంటనే ఔటవడంతో 183 పరుగులకు 8 వికెట్లతో ఓటమి అంచున నిలిచింది. అయితే ఈ దశలో జతగూడిన హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్ లు సమయోచితంగా ఆడి 9 వ వికెట్ కు 49 పరుగులు జోడించారు. హార్దిక్ పాండ్యా 32 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేసాడు. అయితే 49 ఓవర్లో పాండ్యా ఔటవడం, వెంటనే 50 ఓవర్లో బుమ్రా అవుట్ కావడం తో భారత్ 236 పరుగులకు అంటా ఔటయి 6 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. న్యూజీలాండ్ కెప్టెన్ విలియం సన్ కు మాన్ ఆఫ్ ది మాచ్ దక్కింది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *