జబర్దస్తు కామెడీ షో గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో, ఎక్స్ట్ ట్రా జబర్దస్త్ అంటూ వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో తెలియని తెలుగు వాళ్ళెవరూ ఉండరు. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ టి.వి. ప్రోగ్రాం ఇది. ఇప్పటివరకూ తెలుగు చానెళ్ళలో వచ్చే కామెడీ షోలలోనే కాదు, రియాలిటీ, గేం, డాన్స్ షోలలో ఏదీ కూడా ఇంత పాపులర్ కాలేదు. గురువారం, శుక్రవారం వచ్చిందంటేచాలు తెలుగు ప్రజలు అన్ని పనులు ముగించుకుని.. రాత్రి 9.30కి ఠంచన్ గా టీవీ ముందుకు చేరిపోతున్నారు. ఇక ఈ షో లో పాల్గొంటున్న కమెడియన్లకైతే సినిమాల్లో కూడా రానంత పారితోషికం, పేరూ వచ్చి పడ్డాయి. ఒక్క పెర్ఫార్మెన్స్ కి గిఫ్ట్ గా వచ్చే డబ్బు కేవలం కాంప్లిమెంతరీ మాత్రమే. వాళ్ళకి అసలు వచ్చే రెమ్యున రేషన్ వేరే ఉంటుంది. వెండి తెర పారితోషికానికి తీసిపోని విధంగా ఉన్నాయి ఆ మొత్తం.. ఇంతకూ ఏ కమెడియన్ కి ఎంత పారితోషికం ఇస్తారో ఓ లుక్కేయండి…

లైఫ్ ఇచ్చింది:
జబర్దస్త్… ఖతర్నాక్ కామెడీ షో చాలామంది కమేడియన్లకి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ మద్య వచ్చే అన్ని సినిమాల్లోనూ జబర్దస్త్ షో కమెడియన్లు ఒక్కరో ఇద్దరో ఉంటూనే ఉన్నారు.
రేష్మి:
ఈ షో తో పైకి వచ్చిన హాట్ యాంకర్ల సంగతి సరే సరి. రేష్మికి అదివరకే ప్రస్థానం వంటి సినిమాల్ల్లో చేసింది. అయినా ఎవరికీ తెలియదు. ఈ ఒక్క షోతో చాలా పాపులారిటీ వచ్చింది.
అనసూయ:
అనసూయ కూడా అదివరకు చాలా ప్రోగ్రాములకి యాంకర్ గా చేసినా రాని గుర్తింపు ఈ షోతో వచ్చింది. వెండితెర మీద నాగార్జున పక్కన స్టెప్పులేసే దాకా ఎదిగింది.
ఫాలోయింగ్:
ప్రతీ కమేడియన్ ఇప్పుడు సొంతంగా కొన్ని ప్రోగ్రాం లకి హోస్ట్ లుగా కూడా చేస్తున్నారు. జబర్దస్త్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ ఈ రకంగా కూడా పని చేస్తోంది.
ఒక్కో షోకి లక్షల్లో డబ్బు:
వారానికి ఒక షో.. నెలకి కనీసం నాలుగు షోలు… ఒక్కో షోకి లక్షల్లో డబ్బు…. వాళ్ళు పంచే నవ్వులకి ఒక రకంగా ఆ డబ్బూ తక్కువే అనిపిస్తుంది గానీ… వెండి తెర పారితోషికానికే మాత్రం తగ్గటం లేదా మొత్తాలు. ఒక సారి ఒక్కో కమెడియన్ కి ఇచ్చే పారితోషికం ఎంతో తెలుసా..?

చమ్మక్ చంద్ర :
ఒకరకంగా జబర్దస్త్ స్టార్ కమేడియన్ అయిన చంద్ర కి ఒక్క పెర్ఫార్మెన్స్ కి గానూ 2.5 – 3 లక్షలు ముడుతోంది.
సుధీర్ :
చిన్న చితక పాత్రలతో అసలు పేరుకూడా తెలియకుండా ఉన్న సుడిగాలి సుధీర్ 2.5 – 3 లక్షలు అందుకుంటున్నాడు.
అభి:
సాఫ్ట్ వేర్ ఉధ్యోగి అయి ఉండికూడా నటన మీద ఇష్టం తో ఈ రంగం లోకి వచ్చిన అదిరే అభి టీం లీడర్ గా 2.5 – 3 లక్షలు తీసుకుంటున్నాడు.
శంకర్ :
సినిమాలలో కూడా మంచి కమేడియన్ గా రాణించే షకలక శంకర్ 2.5 – 3 లక్షలు అందుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు.
వేణు :
టిల్లు గా ఇదివరకే వెండితెర మీద మనకు పరిచయం ఉన్న వేణు జబర్దస్త్ తర్వాత సినిమా అవకాశాలను వదులుకొని మరీ షోలు చేశాడు. ఈయన పారితోషికం 2.5 – 3 లక్షల వరకు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాడు.
రాం ప్రసాద్ :
ఆటో పంచ్ ల రాం ప్రసాద్ జబర్దస్త్ తోనే తన కెరీర్ మొదలు పెట్టాడు. టీం లీడర్ కాకున్నా తనకున్న కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ లో కీలకంగా మారాడు. ఇతనికి అందేది 1 – 1.8 లక్షలు…
శ్రీను :
గెటప్ సీను పేరుతో జబర్దస్త్ కమల్ హసన్ గా పేరు తెచ్చుకున్న శ్రీను కి 1 – 1.8 లక్షలు
అందరికీ :
రవి, ఫణి, జీవన్, రాకేష్, సన్నీ, అప్పారావు, సుధాకర్, రామూ., ఆర్పీ ఇలా అందరికీ ఒకటినుంచీ ఒకటిన్నరదాకా ఎవరి పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్లకి అందుతున్నాయి. ఇక జడ్జీలకూ ఒక్కో షోకి బాగానె గిడుతోందట…

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *