జక్కన్న ఏం చేశాడో తెలుసా అనుష్క తగ్గలేదు….

anush

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదటి పార్ట్‌ గత సంవత్సరం విడుదల అయిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో ఆ సినిమా వసూళ్లు రాబట్టింది. దాంతో రెండవ పార్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటేలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జక్కన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రెండవ పార్ట్‌ను తెరకెక్కించడం జరిగింది. అయితే అనుష్కను మాత్రం మొదటి పార్ట్‌లో ఉన్నట్లుగా చూపించడం కోసం చాలా కష్టపడ్డట్లుగా తెలుస్తోంది. అనుష్క కోసం ప్రత్యేకమైన విజువల్‌ ఎఫెక్ట్‌ను సైతం వాడాడు.
అనుష్క ‘సైజ్‌ జీరో’ చిత్రం కోసం భారీగా లావు పెరిగింది. ఆ లావును తగ్గడంలో ముద్దుగుమ్మ అనుష్క విఫలం అయ్యింది. ఎంతగా ప్రయత్నించినా కూడా లావు తగ్గలేదు. దాంతో జక్కన్న సమయం లేక పోవడంతో అలాగే షూటింగ్‌ చేశాడు. అయితే మొదటి పార్ట్‌లో అనుష్కకు రెండవ పార్ట్‌లో అనుష్కకు తేడా కనిపిస్తుందనే ఉద్దేశ్యంతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ను వినియోగించి ఆమె లావు తగ్గించాడు. సినిమాలో ప్రస్తుతం కన్నా అనుష్క దాదాపు అయిదు కేజీల బరువు తక్కువగా ఉన్నట్లుగా కనిపించనుంది. ఇటీవల ముంబయిలో జరిగిన సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ కార్యక్రమంలో అనుష్క కనిపించింది. అందులో అనుష్క చాలా లావుగా ఉన్నట్లుగానే కనిపించిన విషయం తెల్సిందే. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *