గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న పవన్‌ దీపావళికి

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ప్రస్తుతం ‘కాటమ రాయుడు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. డాలీ దర్శకత్వంలో ఈ సినిమాను పవన్‌ సన్నిహితుడు శరత్‌ మారార్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఫ్రిబవరి లేదా మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తి కాకుండానే తాజాగా తమిళ దర్శకుడు నేసన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు పవన్‌ సిద్దం అయ్యాడు. ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ రెండు సినిమాలే కాకుండా పవన్‌ మరో సినిమా ప్రకటనను దీపావళికి చేయబోతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
గత కొంత కాలంగా పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వచ్చే నెల నుండి పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దీపావళి సందర్బంగా ఈనెల 30న రాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత రాధాకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు 30వ తారీకున వెళ్లడి చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ మూడు సినిమాలతో బిజీ బిజీ కానున్నాడు. పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ వచ్చే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments

You may also like...