గుడికి మాంసాహారం తినకుండా ఎందుకు వెళతారో తెలుసా?!

వినాయక చవితి నవరాత్రులు అయిపోయాయి.. ఇప్పుడు దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు వాడ వాడలా అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. మొత్తానికి ఈ నెలను ఆధ్యాత్మికతకు నెలవుగానే చెప్పుకోవాలి. దేవుడి పూజలో నిమగ్నమై ఉండే కాలంలో మాంసాహారం తినకూడదని అంటారు. అసలు నాన్ వెజ్ తిని ఆలయాల గడప తొక్కరాదని చెబుతుంటారు. ఏం దేవుడు ఏమైనా వెజిటీరియనా అని వ్యంగంగా ప్రశ్నించే వారూ ఉన్నారు. అయితే ఆ నియమం పెట్టడం వెనుకా పరమార్థం ఉందట. గుడ్డు, మాంసం రజో గుణ, తమో గుణ సంబంధమైన పదార్థాలు. ఇవి తిన్నప్పుడు ఆలోచనా శక్తిని కోల్పోయి కామ వికార కోరికలు ఎక్కువగా కలుగుతాయట! దాంతో మనిషికి చెడు ఆలోచనలే వచ్చే అవకాశాలున్నాయట. ఇంకా ఎందుకు తినరాదంటారంటే..

మనశ్శాంతి కోసమే దేవుడి సన్నిధికి వెళ్తాం. చాలా మంది ఉదయానే స్నానం చేసి చాలా వరకు ఎలాంటి పదర్థాలు తినకుండానే దేవాలయాలకు వెళ్తుంటారు. దాంతో దేవాలయంలో మానసిక ఆనందం, అహ్లాదం లభిస్తాయి. గుడ్డు, మాంసం తిని గుడికి వెళ్లడం వల్ల మన మనసు ప్రశాంతగా ఉండక దేవుడి పై భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉండదు. దాంతో కోరికలు అనేవి తీరవు అంటారు. ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతగా ఉన్నప్పుడు ఏదైనా కోరికలు కోరుకుంటే దానికి ప్రకృతి శక్తులు కూడా తోడై కోరికలు తీరతాయి. ఏది ఏమైనా మహత్తరమైన శక్తి యుక్తులను దేవాలయ సన్నిధి నుంచి అందుకునే క్రమంలో కొద్దిసేపు మాంసాహారానికి దూరంగా నిష్టగా ఉంటే పోయేదేముంది చెప్పండి..

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *