గాలి వారి పెళ్లిలో తారా లోకం

కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్ధన్‌ రెడ్డి కూతురు వివాహం వచ్చే నెలలో అంగరంగ వైభవంగా జరుపబోతున్న విషయం తెల్సిందే. పెళ్లి కోసం గాలి వారి ఫ్యామిలీ చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే మతి పోతుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ ఒక్కరు ఈస్థాయిలో వివాహాన్ని నిర్వహించి ఉండరు అన్నట్లుగా గాలి ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే రెడీ అయిన ఇన్విటేషన్‌ కార్డులు అందుకు నిదర్శణంగా నిలుస్తున్నాయి. పెళ్లి ఆహ్వానం కోసం ఒక వీడియోను రెడీ చేసి దాన్ని ఇన్విటేషన్‌లో పెట్టడం జరిగింది. ఒక్కో ఇన్విటేషన్‌కు ఏకంగా 6 నుండి 8 వేల వరకు అయ్యి ఉంటుందని అంచన. ఇంత భారీగా జరుగుతున్న వేడుకకు బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్‌ నుండి కూడా తారా లోకం తరలి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో గాలి వారి ఇంట పెళ్లి వేడుక జరుగుతుంది. అందుకోసం దేశ వ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. గాలి జనార్ధన్‌ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో టాలీవుడ్‌ నుండి కూడా పలువురు స్టార్స్‌ను ఆహ్వానించడం జరిగింది. ఆ పెళ్లికి మహేష్‌బాబు, చిరంజీవిలతో పాటు పలువురు హీరోలు మరియు హీరోయిన్స్‌ హాజరు కానున్నారు. టాలీవుడ్‌లో దాదాపు 50 మందికి గాలి వారి ఆహ్వానం అందబోతుంది. మొత్తానికి గాలి వారి ఇంట్లో పెళ్లి దేశ వ్యాప్తంగా సంచలనం కాబోతుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *